Hyderabad T20 Match: తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎనిమిది మంది ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఉచితంగా మ్యాచ్ చూడడానికి వచ్చారు. తమకు టికెట్లు దొరకకపోయినప్పటికీ మైదానానికి వచ్చినందుకు ఆ ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేశారు. మైదానం వద్ద వారు పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి గాయాలు పూర్తిగా నయం కాలేదు. ఆ ఎనిమిది మందిని ప్రత్యేక బస్సులో శ్రీనివాస్ గౌడ్ మైదానానికి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రీనివాస్ గౌడ్ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. కాగా, రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Hyderabad T20 Match: తొక్కిసలాటలో గాయపడ్డ వారిని ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Hyderabad T20 Match

Hyderabad T20 Match: క్రికెట్ మ్యాచ్ టికెట్లు కొనడానికి వచ్చి సికింద్రాబాద్ లోని జింఖానా మైదానంలో తొక్కిసలాటలో గాయపడ్డ వారిని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లారు. కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో చివరి టీ20 మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడికి భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లోని జింఖానా మైదానంలో టికెట్లు అమ్మారు. హెచ్‌సీఏ సరైన చర్యలు తీసుకోకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

వారిలో ఎనిమిది మంది ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో ఉచితంగా మ్యాచ్ చూడడానికి వచ్చారు. తమకు టికెట్లు దొరకకపోయినప్పటికీ మైదానానికి వచ్చినందుకు ఆ ఎనిమిది మంది హర్షం వ్యక్తం చేశారు. మైదానం వద్ద వారు పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల్లో కొందరికి గాయాలు పూర్తిగా నయం కాలేదు. ఆ ఎనిమిది మందిని ప్రత్యేక బస్సులో శ్రీనివాస్ గౌడ్ మైదానానికి తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్రీనివాస్ గౌడ్ తన ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేశారు. కాగా, రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Hyderabad T20 Match : హైదరాబాద్‌లో పీక్స్‌కు క్రికెట్ ఫీవర్.. అభిమానులతో కిటకిటలాడుతున్న ఉప్పల్ స్టేడియం పరిసరాలు