స్మిత్ స్టన్నింగ్ క్యాచ్: సెకన్ల వ్యవధిలో పట్టేశాడు

  • Published By: vamsi ,Published On : December 13, 2019 / 01:40 PM IST
స్మిత్ స్టన్నింగ్ క్యాచ్: సెకన్ల వ్యవధిలో పట్టేశాడు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 248 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడి 416పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన న్యూజిలాండ్ రెండవ రోజు ఆట ముగిసే సమాయానికి 109పరుగులకే 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

416పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్న టైమ్‌లో స్టీవ్ స్మిత్ అధ్భుతమైన క్యాచ్ పట్టి ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పెవీలియన్ పంపించాడు. ఈ క్యాచ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. సెకన్ల వ్యవధిలో బాల్ క్యాచ్ పట్టడంతో.. వీడియో ఇప్పుడు ఆస్ట్రేలియా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

సెకెండ్ స్లిప్‌‌లో ఉన్న స్మిత్ బాల్‌ను పట్టుకున్న తీరును ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ అద్భుతమైన క్యాచ్‌ను కూడా స్మిత్ స్టార్క్ బౌలింగ్‌లోనే పట్టాడు. ప్రస్తుతం మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది.

కేన్ విలియమ్సన్, టేలర్ 76 పరుగుల భాగస్వామ్యాన్ని స్మిత్ క్యాచ్ బ్రేక్ చేసింది. ప్రస్తుతం టేలర్ 66పరుగులతో వాట్లింగ్ పరుగులు ఏమీ చెయ్యకుండా క్రీజులో ఉన్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది.