Cricketer Taniya Bhatia : భారత క్రికెటర్‌కు చేదు అనుభం.. హోటల్‌ గదిలో బ్యాగ్ చోరీ

భారత మహిళా క్రికెటర్ తనియా భాటియాకు ఇంగ్లండ్ టూర్ లో చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది.

Cricketer Taniya Bhatia : భారత క్రికెటర్‌కు చేదు అనుభం.. హోటల్‌ గదిలో బ్యాగ్ చోరీ

Cricketer Taniya Bhatia : భారత మహిళా క్రికెటర్ తనియా భాటియాకు ఇంగ్లండ్ టూర్ లో చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ఆడి 3-0తో వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు లండన్ లోని మారియట్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా వికెట్ కీపర్ తనియా భాటియా బ్యాగ్ కనిపించకుండా పోయింది.

ఆ బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు ఉన్నాయని తనియా భాటియా వాపోయింది. ఖరీదైన వస్తువులున్న బ్యాగ్ చోరీకి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ ఘటనతో తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపింది. తన గదిలోకి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారని, వారే తన బ్యాగ్ చోరీ చేసి ఉంటారని తనియా చెప్పింది.

ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భాగస్వామ్య హోటల్ లో భద్రతా వైఫల్యం విస్మయానికి గురిచేస్తోందని వెల్లడించింది. త్వరగా దర్యాప్తు జరిపి, ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవాలని తనియా డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై లండన్ లోని మారియట్ హోటల్ స్పందించింది. టీమిండియా మహిళా క్రికెటర్ తనియాకు క్షమాపణలు తెలిపింది. ఏ తేదీల్లో తమ హోటల్ లో బస చేసిందో ఆ వివరాలను పంపిస్తే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామంది.

క్రికెటర్ బ్యాగ్ చోరీ..