కష్టాల్లో ఆసీస్: కోహ్లీసేనదే పైచేయి

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచేయి సాధించింది.

  • Published By: sreehari ,Published On : January 5, 2019 / 08:39 AM IST
కష్టాల్లో ఆసీస్: కోహ్లీసేనదే పైచేయి

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచేయి సాధించింది.

  • మూడో రోజు ముగిసిన ఆట.. ఆస్ట్రేలియా స్కోరు 236/6 

  • విజృంభించిన భారత స్పిన్నర్లు.. 386 ఆధిక్యంలో భారత్  

సిడ్నీ: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య  సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు విజృంభించడంతో భారత్ పైచేయి సాధించింది. భారత స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాట్స్ మన్ కు చెమటలు పట్టించారు. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 83.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 236 పరుగులు సాధించగా హ్యాండ్స్ కంబ్ (28), కమిన్స్ (25) క్రీజులో ఉన్నారు. భారత్ 386 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్ ను కాపాడుకోవడానికి మరో రెండు రోజుల సమయం ఉండగా.. ఆసీస్ చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. 

మూడో రోజు ఆటలో భాగంగా 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. లంచ్ విరామ సమయానికి 122 పరుగులు చేసిన ఆసీస్.. 24 వికెట్లకు మూడు వికెట్లను చేజార్చుకుంది. కుల్ దీప్ యాదవ్ (3/71), రవీంద్ర జడేజా (2/62) ఆసీస్ ఆటగాళ్లను ఒకరితరువాత మరొకరిని పెవిలియన్ బాట పట్టించడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు భారత్ 167.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 622 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది.