500 టెస్టు వికెట్లు తీసిన Stuart Broad

500 టెస్టు వికెట్లు తీసిన Stuart Broad

ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఇద్దరి బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఇదే వరుసలో మరో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్ లో కరేబియన్ బ్యాట్స్ మన్ బ్రాత్ వైట్ వికెట్ తీసిన స్టువర్ట్ బ్రాడ్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. యాదృచ్ఛికమైన ఘటన ఏమంటే 2017లో అండర్సన్ తీసిన 500వ వికెట్ కూడా బ్రాత్‌వైట్‌దే.

బ్రాడ్ 140వ టెస్టు ఆడుతున్నాడు. 500వికెట్ల మైలు రాయిని కాస్త ఆలస్యంగానే చేరుకున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి ముత్తయ్య మురళీధరన్ కేవలం 87మ్యాచ్ లే పట్టింది. అనిల్ కుంబ్లే 105మ్యాచ్ లు, షేన్ వార్న్ 108, గ్లెన్ మ్యాక్ గ్రాత్ 110వ టెస్టులో, అండర్సన్ 129వ టెస్టు మ్యాచ్ లో సాధించారు.

ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లో డిట్రాక్టర్స్ నోర్లు మూయించాడు బ్రాడ్. చక్కటి ఫామ్‌లో ఉన్న బ్రాడ్‌ను ఫస్ట్ టెస్టులో పక్కకు పెట్టేయడంతో రెండో టెస్టులో చెలరేగిపోయాడు. ఆరువికెట్లు పడగొట్టాడు.. అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అండర్సన్, మెక్ గ్రాత్, వాల్ష్ తర్వాత బ్రాడ్ నిలిచాడు. టెస్టుల్లో 15సార్లు 5వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది బ్రాడ్‌కు.