IPL 2019: సన్ రైజర్స్‌కు గుడ్ న్యూస్

IPL 2019: సన్ రైజర్స్‌కు గుడ్ న్యూస్

ఐపీఎల్ ఆరంభానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. సన్‌రైజర్స్ అభిమానులంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. గతేడాది సీజన్‌లో హైదరాబాద్ జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కెప్టెన్ కోసం ఎదురుచూపులు ఫలించాయి. గాయం నుంచి కోలుకున్న కేన్ విలియమ్సన్ ప్రాక్టీస్ సెషన్ కు వచ్చేయనున్నాడు. 

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కివీస్ వన్డే మ్యాచ్‌లలో భుజం గాయానికి గురైంది. దీంతో కనీసం బ్యాటింగ్‌ కూడా సరిగా చేయలేకపోయాడు. వైద్యులు ఆసుపత్రిలో చేరమని సలహా ఇవ్వడంతో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి శుక్రవారమే అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నాడని హైదరాబాద్ జట్టు ప్రకటించింది. 

హైదరాబాద్ జట్టులో మరో కీలక ప్లేయర్ డేవిడ్ వార్నర్ అందుబాటులోకి వచ్చేశాడు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో నిషేదాన్ని పూర్తి చేసుకుని ఆసీస్ వరల్డ్ కప్ జట్టులోకి స్థానం దక్కించుకోవాలని తాపత్రయపడుతున్న వార్నర్.. ఐపీఎల్ లోనూ రాణించాలని ఆశపడుతున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న వార్నర్.. కెప్టెన్ విలియమ్సన్ జట్టును ఈ సారి ఏ రేంజ్ లో నిలబెడతారో చూడాలి. మార్చి 23 నుంచి ఐపీఎల్ మొదలవుతుండగా.. 24వ తేదీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఆదివారం ఆడనుంది.