సండే ఫైట్ : సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 02:18 AM IST
సండే ఫైట్ : సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

విండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండింయా బోణీ కొట్టింది. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది. విండీస్ భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పటికీ.. కోహ్లీసేన మరో ఎనిమిది బంతులుండగానే… ఆరు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. కెప్టెన్ కోహ్లీ చెలరేగడంతో… కొండంత లక్ష్యం చిన్నగా మారిపోయింది. ఇప్పుడు అదే జోష్‌తో రెండో టీ 20కి రెడీ అయింది కోహ్లీ సేన.

2019, డిసెంబర్ 08వ తేదీ ఆదివారం తిరువనంతపురంలో మ్యాచ్ జరుగనుంది. టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ వరల్డ్ చాంపియన్‌ అయినప్పటికీ.. ఆ టీమ్‌పై భారత్‌ వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. అదే జోరును ప్రదర్శిస్తూ… ఇవాళ్టి మ్యాచ్‌లో నెగ్గి.. 11వ తేదీన జరిగే మూడో టీ ట్వంటీని నామమాత్రం చేయాలని భావిస్తోంది. 

ఉప్పల్ మ్యాచ్‌లో చాహల్ తప్ప బౌలర్లంతా విఫలమయ్యారు. చాహల్ రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ నాలుగు ఓవర్లలో ఏకంగా 36 పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. దీపక్ చాహర్ ఏకంగా 56 పరుగులు సమర్పించుకోగా, సుందర్ మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ శివం దూబే ఒకే ఒక్క ఓవర్ వేసి 13 పరుగులు ఇచ్చాడు. అటు ఈజీ క్యాచ్‌లను కూడా టీమిండియా ప్లేయర్లు నేలపాలు చేశారు. యంగ్ ప్లేయర్లు ఫీల్డ్‌లో అంత చురుగ్గా కదల్లేకపోయారు. ఫలితంగా విండీస్ భారీ స్కోర్ చేసింది. 

మరోవైపు.. విండీస్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బ్యాట్స్‌మెన్‌పై చెలరేగినా… బౌలర్లు మాత్రం దండిగా పరుగులిచ్చుకున్నారు. 207 పరుగుల మంచి స్కోర్ చేసినా..మ్యాచ్‌ను దక్కించుకోలేకపోయారు. బౌలింగే కొంప ముంచిందని కరేబియన్లు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవాళ్టి మ్యాచ్ గెల్చి సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుపుకోవాలని విండీస్ భావిస్తోంది.
Read More : విరాటపర్వం : టీమిండియా గ్రాండ్ విక్టరీ