Suresh Raina : నేను కూడా బ్రాహ్మిణ్‌‌నే…ఉతికారేస్తున్న నెటిజన్లు

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. సంస్కృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇతను చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు ప్రశ్నిస్తుండగా..ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు.

Suresh Raina : నేను కూడా బ్రాహ్మిణ్‌‌నే…ఉతికారేస్తున్న నెటిజన్లు

Raina

Im Also Brahmin : టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. సంస్కృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇతను చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు. పలువురు ప్రశ్నిస్తుండగా..ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గుపడాలి అంటూ ఘాటు రిప్లై ఇస్తున్నారు.

Read More : Google : గూగుల్ మరో కీలక నిర్ణయం..త్వరలో నిలిచిపోనున్న బుక్ మార్క్స్ సేవలు

అసలు రైనా ఏం కామెంట్స్ చేశారు :-

సురేశ్ రైనా…టీమిండియాకు మాజీ క్రికెటర్ గా ఉన్నారు. ధోనీ కెప్టెన్ గా ఉన్న రోజుల్లో టీమిండియాలో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగారు. విరాట్ కోహ్లీ చేతికి టీమిండియా పగ్గాలు రావడంతో ఇతను జట్టుకు క్రమక్రమంగా దూరమయ్యారు. కెప్టెన్ గా కొనసాగిన ధోనీ…రిటైర్ మెంట్ ప్రకటించడంతో..అదే బాటలో రైనా కూడా పయనించాడు. ప్రస్తుతం తమిళ‌నాడు ప్రీమియ‌ర్ లీగ్ (TNPL)కు రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Read More : Yadadri Landslide : యాదాద్రిలో విరిగిపడిన కొండచరియలు, రాకపోకలు నిలిపివేత

సంస్కృతిపై నోరు జారిన రైనా :-
ఐపీఎల్ ప్రారంభం నుంచి CSKతోనే రైనా ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో…అక్కడి సంస్కృతిపై నోరు జారాడు. మరో కామెంటర్ చెన్నై సంస్కృతి గురించి అడిగారు. దీనిపై రైనా స్పందిస్తూ…నేను కూడా బ్రాహ్మిణ్ ను అనుకుంటున్నా…ఇక్కడి సంస్కృతి అంటే చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. తన జట్టు సహచరులు అంటే చెప్పలేనంత అభిమానం, అనిరుద్ధ, శ్రీకాంత్, బద్రినాథ్, బాలాజీలతో కలిసి ఆడినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. CSK జట్టులో మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారాయన. సీఎస్ కే జట్టులో భాగస్వామం కావడం సంతోషంగా ఉందన్నారు.

Read More : Raj Kundra Arrest : రాజ్ కుంద్రా, అజింక్యా రహానే ట్విట్టర్ సంభాషణ వైరల్

నెటిజన్ల మండిపాటు :-
బ్రాహ్మిణ్ గురించి..సంస్కృతిపై చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఘాటుగానే స్పందిస్తున్నారు. చెన్నై అంటే కేవలం బ్రాహ్మిణ్ లేనా అంటూ ఉతికిపారేస్తున్నారు. రైనా ఇలాంటి కామెంట్స్ చేసినందుకు సిగ్గు పడాలి…నువ్వు నిజమైన చెన్నై సంస్కృతి చూసినట్లు లేవు..అంటూ విరుచుకపడుతున్నారు. సురేశ్‌ రైనా 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 2005 సంవత్సరంలో ఇతను భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ 20 మ్యాచ్ లు ఆడారు రైనా. టీ 20 స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ గా ఇతనికి పేరు ఉంది.