IPL 2021: సన్‌రైజర్స్‌‌, ఢిల్లీ పోరు! జట్టులోకి మరో పేసర్! తుది జట్లు ఇవే!

ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢికొట్టనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక హ్యాట్రిక్ ఓటముల అనంతరం ఒక మ్యాచ్ లో విజయం సాధించిన హైదరాబాద్, ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లు నెగ్గిన ఢిల్లీతో తలపడుతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఏది బౌలింగ్ కు అనుకూలిస్తుంది.

IPL 2021: సన్‌రైజర్స్‌‌, ఢిల్లీ పోరు! జట్టులోకి మరో పేసర్! తుది జట్లు ఇవే!

Ipl 2021

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢికొట్టనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక హ్యాట్రిక్ ఓటముల అనంతరం ఒక మ్యాచ్ లో విజయం సాధించిన హైదరాబాద్, ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు మ్యాచ్ లు నెగ్గిన ఢిల్లీతో తలపడుతుంది. ఇక పిచ్ విషయానికి వస్తే ఏది బౌలింగ్ కు అనుకూలిస్తుంది.

పరుగులు చెయ్యడానికి బ్యాట్స్ మ్యాన్స్ తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ స్టేడియంలో 9 మ్యాచ్ లు జరగ్గా కేవలం రెండు మ్యాచ్ లలోనే స్కోర్ 170 పరుగులు దాటింది. ఈ పిచ్ బ్యాట్స్ మ్యాన్ కి కత్తిమీద సామనే చెప్పాలి. ఇక సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌, క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ పోరుతో చెన్నైలో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ముగుస్తాయి. దాంతో ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్ ట్రాక్ సిద్దం చేస్తారా? లేక ఎప్పటిలానే టర్న్ పిచ్ అందిస్తారా? అనేది చూడాలి. బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌కు సవాలు విసురుతున్న చెపాక్‌‌‌‌‌‌‌‌ స్లో వికెట్‌‌‌‌‌‌‌‌ను అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు అవసరమయ్యాయి.

జట్టు విషయానికి వస్తే ఇండియన్ ఆటగాళ్లు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతున్నారు. ఫారిన్ ఆటగాళ్లు మంచి ఆటతీరు కనబర్చుతున్నారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ భారమంతా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌, విలియమ్సన్‌‌‌‌‌‌‌‌, బెయిర్‌‌‌‌‌‌‌‌ స్టో పైనే ఉండనుంది. మరోవైపు బోలర్లు గాయపడటం హైదరాబాద్ ను కలవరపెడుతుంది. ఇప్పటికే నటరాజన్ ఐపీఎల్ నుంచి తప్పుకోగా భువనేశ్వర్ కుమార్ కూడా పంజాబ్ తో జరిగిన జరిగిన మ్యాచ్ లో గాయపడ్డారు. కండరాలు పట్టేయడంతో మధ్యలోనే మైదానం వీడాడు. ఆ మ్యాచ్‌లో అతడు తన పూర్తి కోటా ఓవర్లను వేయలేదు. దాంతో భువనేశ్వర్‌ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగేది అనుమానమే. ఒకవేళ భువీకి విశ్రాంతినిస్తే సందీప్ శర్మకు చోటు దక్కవచ్చు.

హైదరాబాద్ జట్టుతో పోల్చితే ఢిల్లీ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. బ్యాట్స్ మెన్స్ అంతా ఫామ్ లో ఉన్నారు. ఢిల్లీ జట్టులో శిఖర్ ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. కెప్టెన్ పంత్, స్టీవ్‌ స్మిత్, హెట్‌మైర్, స్టొయినిస్‌లతో ఢిల్లీ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. చెపాక్ లో స్పిన్నర్లు కి రోల్ పోషించనున్నారు. ఈ పిచ్ లో స్పిన్ బౌలింగ్ ఎదురుకోవడంలో బ్యాట్స్ మెన్ విఫలమవుతున్నారు.

తుది జట్లు: (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్(కెప్టెన్/కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్‌మైర్, లలిత్ యాదవ్, అశ్విన్, కగిసో రబడా/క్రిస్ వోక్స్, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో(కీపర్), కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, విరాట్ సింగ్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్/సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్