Suryakumar Yadav : చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్

టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు.

Suryakumar Yadav : చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం.. టీ20ల్లో వరల్డ్ రికార్డ్

Suryakumar Yadav : టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. టీ20 క్రికెట్ లో విశ్వరూపం చూపిస్తున్నాడు. మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్ అంటూ దంచి కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా బంతి బౌండరీ దాటాల్సిందే. భారత జట్టుకు ఎంపికైనప్పటి నుంచి సత్తా చాటుతూ వస్తున్న సూర్య.. ఈ ఏడాది ఆరంభం నుంచి మరింతగా చెలరేగాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌లో వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్ లో ఒక్క ఏడాదిలో వెయ్యికి పైగా పరుగులు చేసిన తొలి భారత ప్లేయర్‌గా 31ఏళ్ల సూర్య రికార్డు నెలకొల్పాడు. 28వ ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించాడు. అంతేకాదు టీ20ల్లో ఒకే క్యాలండర్ ఇయర్ లో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. సూర్య కన్నా ముందు ఈ ఘనతను పాక్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ 2021లోనే సాధించాడు.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన సూర్య.. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ (25 బంతుల్లో 61 పరుగులు.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్ లో టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నతొలి క్రికెటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ (1026) పరుగులతో తొలి స్థానంలో ఉండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌-పాకిస్తాన్ (924), విరాట్‌ కోహ్లీ (731) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలో 100 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని అత్యధిక స్ట్రైక్‌రేట్‌ (193.96) కలిగున్న ఆటగాడిగానూ సూర్యకుమార్‌ రికార్డు సృష్టించాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో సూర్య కుమార్‌.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగులే చేసి నిరాశపర్చగా.. నెదర్లాండ్స్‌పై (25 బంతుల్లో 51), సౌతాఫ్రికాపై (68), బంగ్లాదేశ్‌పై ( 16 బంతుల్లో 30 పరుగులు) రాణించాడు.

మరోవైపు జింబాబ్వే తో మ్యాచ్ లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్‌.. టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్‌ తరఫున వేగవంతమైన హాఫ్‌ సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్‌ సింగ్‌ (12 బంతుల్లో), కేఎల్ రాహుల్‌ (18 బంతుల్లో), యువరాజ్‌ సింగ్‌ (20 బంతుల్లో) సూర్యకుమార్‌ కంటే ముందున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీ20 క్రికెట్‌లో పెద్దగా టైమ్ ఉండదు. వన్డేలు, టెస్టుల్లా క్రీజులో కుదురుకోవడానికి టైం తీసుకోవడానికి ఉండదు. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడాల్సి ఉంటుంది. అందుకే అందరు బ్యాటర్లు ఈ ఫార్మాట్‌కు సరిపోరు. కానీ సూర్యకుమార్ యాదవ్ అలా కాదు. అతని ఆటతీరు పొట్టి ఫార్మాట్‌ కోసమే పుట్టినట్లు ఉంటుంది. తొలి బంతి నుంచే బౌండరీలు బాదడం సూర్య స్పెషాలిటీ.

జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్‌ ఒక సంచలనం అని చెప్పాలి. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నిం‍గ్స్‌ ఆడిన విధానం హైలైట్‌. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్నోళ్లు ఆశ్చర్యపోకుండా ఉండలేము. మాములుగా ఏ క్రికెటర్‌ అయినా తనకు సాధ్యమైనంత వరకు ఆడుతూ సిక్సర్లు, ఫోర్లు బాదడం చూస్తుంటాం.

కానీ సూర్య ఇన్నింగ్స్‌ చూస్తే ఎటు పడితే అటు యధేచ్చగా షాట్లు కొట్టాడు. బ్యాక్‌వర్డ్‌, అప్పర్‌ కట్‌, లాంగాన్‌, లాంగాఫ్‌, మిడాన్‌, మిడాఫ్‌, స్క్వేర్‌లెగ్‌, కవర్‌ డ్రైవ్‌.. ఇలా క్రికెట్‌లో ఎన్ని షాట్లు ఉంటే అన్ని షాట్లను సూర్య ట్రై చేశాడు. సూర్యకుమార్‌ కొట్టుడు చూస్తుంటే.. ఏమా కొట్టుడు అనుకుంటూనే అతని శరీరంలో స్రింగులేమైనా ఉన్నాయా అన్న సందేహం కలగక మానదు.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ మిస్టర్‌ 360కి పెట్టింది పేరు. అతను బ్యాటింగ్‌ లో గ్రౌండ్‌కు నలుమూలలా షాట్లు కొడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతన్ని మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అని అభివర్ణిస్తారు. కానీ సూర్యకుమార్‌ ఇవాళ ఏబీ డివిలియర్స్‌నే తలదన్నేలా కనిపించాడు. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు ఆడుతూ మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ అనే పేరును సార్థకం చేసుకున్నట్లగానే అనిపిస్తుంది.