Suryakumar Yadav: ఏంట‌య్యా సూర్య ఇది.. ప‌డుకున్న తెలుగు ప్లేయర్‌తో ప‌రాచ‌కాలా..

విమానంలో వెలుతున్న స‌మ‌యంలో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు, తెలుగు కుర్రాడు అయిన తిల‌క్ వ‌ర్మ‌(Tilak Varma)ను ఆట‌ప‌ట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

Suryakumar Yadav: ఏంట‌య్యా సూర్య ఇది.. ప‌డుకున్న తెలుగు ప్లేయర్‌తో ప‌రాచ‌కాలా..

Suryakumar Yadav fun with Tilak Varma

Suryakumar Yadav-Tilak Varma: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్(IPL) 2023 సీజ‌న్‌లో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) పై విజ‌యం సాధించిన ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians) పుల్ ఖుషీలో ఉంది. గుజ‌రాత్ టైటాన్స్‌తో క్వాలిఫైయ‌ర్ 2 ఆడేందుకు అహ్మ‌దాబాద్ చేరుకుంది. అయితే.. విమానంలో వెలుతున్న స‌మ‌యంలో సూర్య‌కుమార్ యాద‌వ్(Suryakumar Yadav) త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు, తెలుగు కుర్రాడు అయిన తిల‌క్ వ‌ర్మ‌(Tilak Varma)ను ఆట‌ప‌ట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది.

అల‌సిపోయిన తిల‌క్ వ‌ర్మ విమానంలో నిద్ర‌పోతున్నాడు. అయితే అత‌డు కాస్త నోరు తెరిచి ప‌డుకోవ‌డాన్ని సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌మ‌నించాడు. ఎయిర్ హోస్ట‌స్ వద్ద ఓ నిమ్మ‌కాయ ముక్క‌ను తీసుకున్నాడు. దాని ర‌సాన్ని తిల‌క్ వ‌ర్మ నోట్లో పిండాడు. ఆ పిలుపు ద‌నానికి వెంట‌నే తిల‌క్ వ‌ర్మ లేచాడు. అయితే.. కాసేప‌టి వ‌ర‌కు ఏం జ‌రిగిందో అత‌డికి అర్ధం కాలేదు. ఇంతలో సూర్య‌కుమార్ యాద‌వ్‌తో పాటు ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాళ్లు నువ్వుకున్నారు.

IPL 2023 MI Vs LSG : మద్వాల్ విజృంభణ.. లక్నో ఇంటికి, ముంబై ముందుకి..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ 41, సూర్య‌కుమార్ యాద‌వ్ 33, తిల‌క్ వ‌ర్మ 26 ప‌రుగుల‌తో రాణించారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో న‌వీన్ ఉల్ హ‌క్ నాలుగు వికెట్ తీయ‌గా, శార్దూల్ ఠాకూర్ మూడు, మోసిన్ ఖాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో 101 ప‌రుగుల‌కే ఆలౌటైంది. మార్క‌స్ స్టోయినిస్‌(40) రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాశ్ మ‌ధ్వ‌ల్ ఐదు వికెట్లు తీయ‌గా, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Naveen Ul Haq: విరాట్ కోహ్లికి సారీ చెప్పిన న‌వీన్ ఉల్ హ‌క్‌.. నిజ‌మెంత‌..?