Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ టెస్టుల్లోనూ ఆడాలి: రవి శాస్త్రి

‘‘సూర్యకుమార్ యాదవ్ టెస్టు క్రికెట్లో ఆడట్లేదు. అయితూ, అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే ఆటగాడు. అతడిని టెస్టుల్లోనూ ఆడించాలి. ఐదో స్థానంలో బ్యాట్స్‌మన్ గా పంపాలి’’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అతడు ఇప్పటివరకు టెస్టు మ్యాచు ఆడలేదు.

Ravi Shastri: టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని భారత జట్టు మాజీ కోచ్ రవి శాస్త్రి అన్నారు. అతడిని టెస్టుల్లోనూ ఆడించాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల టీ20 ప్రపంచ కప్ లో నెదర్లాండ్స్ పై భారత్ గెలిచిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ తో రవి శాస్త్రి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ పోస్ట్ చేసింది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఆటతీరుపై రవి శాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘టెస్టు క్రికెట్ లో సూర్యకుమార్ యాదవ్ ను చూడాలనుకుంటున్నారా?’ అని ఐసీసీ పేర్కొంది.

‘‘సూర్యకుమార్ యాదవ్ టెస్టు క్రికెట్లో ఆడట్లేదు. అయితూ, అతడు మూడు ఫార్మాట్లలోనూ ఆడగలిగే ఆటగాడు. అతడిని టెస్టుల్లోనూ ఆడించాలి. ఐదో స్థానంలో బ్యాట్స్‌మన్ గా పంపాలి’’ అని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అతడు ఇప్పటివరకు టెస్టు మ్యాచు ఆడలేదు.

View this post on Instagram

A post shared by ICC (@icc)