IND vs NZ: రాహుల్ ఔట్, టెస్టు సిరీస్ కోసం జట్టులోకి సూర్య కుమార్

'నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహేబిలేషన్ కోసం కేఎల్ రాహుల్ వెళ్లనున్నాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నాం. 25నవంబర్ 2021 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది'...

IND vs NZ: రాహుల్ ఔట్, టెస్టు సిరీస్ కోసం జట్టులోకి సూర్య కుమార్

Team India

IND vs NZ: ఫామ్ లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు జట్టులో స్థానం కల్పించారు. ఎడమ తొడలోని కండరాల నొప్పి కారణంగా న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీస్ కు దూరంగా ఉంచారు.

‘నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహేబిలేషన్ కోసం కేఎల్ రాహుల్ వెళ్లనున్నాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను తీసుకున్నాం. 25నవంబర్ 2021 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది’ అని బీసీసీఐ స్టేట్మెంట్ లో పేర్కొంది.

టెస్టు సిరీస్ కు విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ కూడా విశ్రాంతి తీసుకోవడంతో అజింకా రహానె కెప్టెన్సీలో శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ లు ఓపెనర్లుగా సిరీస్ ఆరంభం కానుంది. సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మొహమ్మద్ షమీ, బుమ్రాలు విశ్రాంతిలో ఉన్నారు.

……………………….. ”టీమిండియా డైట్‌లో పోర్క్, బీఫ్ ఎందుకుండదు?”

శ్రేయాస్ అయ్యర్ లేదా సూర్య కుమార్ యాదవ్ ఇద్దరిలో ఒకరు టెస్టు ఫార్మాట్ లో కనిపిస్తారనుకున్నట్లే జరిగింది. రాహుల్ లేని పరిస్థితుల్లో శుభ్ మన్ కు మిడిలార్డర్ అవకాశం దక్కుతుంది. 2021-23 సైకిల్ లో భాగంగా టీమిండియా.. న్యూజిలాండ్ లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఆరంభించనున్నారు.

భారత టెస్టు జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా . అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, Md. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

…………………….. : హైబిపి అదుపులో ఉండేందుకు..ఇలా చేసి చూడండి…