అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నారా?: సూర్య, సుందర్ అవుట్‌లపై పేలుతోన్న జోక్‌లు

అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నారా?: సూర్య, సుందర్ అవుట్‌లపై పేలుతోన్న జోక్‌లు

Suryakumar Yadav Washington Sundar Fall To Dubious Decisions1

నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించగా.. భారత్‌ నిర్దేశించిన 186పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ చేరుకోలేకపోయింది. భారత్‌ బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ రెచ్చిపోయాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి 31 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. ఓపెనర్లు రోహిత్‌ 12, రాహుల్‌ 14 పరుగులకే వెనుదిరిగినా సూర్యకుమార్ భారీ స్కోరు చేశారు.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదం అవగా.. 31 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మ్యాచ్‌లో మలాన్ పట్టిన క్యాచ్‌, బంతి నేలను తాకినట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం నిర్ణయం ప్రకటించడానికి చాలా సమయం తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు.

ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది ప్రకటించిన థర్డ్ అంపైర్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ నడుస్తోంది. వీరేంద్ర సెహ్వాగ్, లక్ష్మణ్ లాంటి మాజీ క్రికెటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని అంపైర్ నిర్ణయం ఇచ్చినట్టుగా సెహ్వాగ్ సెటైర్ వేశాడు. దీన్ని ఎలా ఔట్ ఇస్తారంటూ ట్విట్టర్ వేదికగా లక్ష్మణ్ ప్రశ్నించాడు.

బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్‌గా ప్రకటించాడంటే, థర్డ్ అంపైర్ కళ్లకి ఆపరేషన్ చేయించాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అది మాత్రమే కాకుండా సుందర్ ఔట్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయ్. సుందర్ ది ఔట్ కాదని..సిక్స్ అని నెటిజన్లు థర్డ్ అంపైర్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.