Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

100 ర్యాంక్ స్విమ్మర్.. ఒలంపిక్స్ గేమ్స్ లో స్వర్ణపతాకం సాధించాడు.. ఎవరు ఊహించని విధంగా విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలంపిక్స్ గేమ్స్ లో ఆదివారం 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీ నిర్వహించారు.

Tokyo Olympics 2020 : స్విమ్మింగ్ లో స్వర్ణం సాధించిన 100వ ర్యాంక్ కుర్రాడు

Tokyo Olympics 2020

Tokyo Olympics 2020 :  100 ర్యాంక్ స్విమ్మర్.. ఒలంపిక్స్ గేమ్స్ లో స్వర్ణపతాకం సాధించాడు.. ఎవరు ఊహించని విధంగా విజయం సాధించి ఆశ్చర్యపరిచాడు. టోక్యోలో జరుగుతున్న 2020 ఒలంపిక్స్ గేమ్స్ లో ఆదివారం 400 మీటర్ల స్విమ్మింగ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 100 ర్యాంక్ లో ఉన్న తునీసియాకు చెందిన అహ్మద్ అయూబ్ ఆఫ్నాయ్ విజయం సాధించారు.

ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మెక్లౌగ్లిన్ విజయం సాధిస్తారని అందరు భావించారు. కానీ అతడు రెండవ స్థానానికి పరిమితమయ్యాడు. 200 మీటర్ల వరకు ముందు ఉన్న జాన్ మెక్లౌగ్లిన్ ఆ తర్వాత వెనకపడ్డాడు.. ఈ సమయంలోనే అహ్మద్ అనూహ్యంగా పుంజుకొని ముందుకు వెళ్ళాడు. 400 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 46 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు.

ఇక ఈ స్విమ్మింగ్ పోటీల్లో అమెరికా స్విమ్మర్ కైరాన్ స్మిత్ మూడవ స్థానంలో నిలిచి కాంస్యపతకం సొంత చేసుకున్నారు. ఇక ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన అహ్మద్.. తాను గెలిచామన్న విషయం ఇప్పటికి నమ్మలేకపోతున్నాని తెలిపాడు. తన జీవితంలో ఇదో అత్యుత్తమ రేసు అని.. నిన్నటికంటే ఈ రోజు చాలా మెరుగు పడ్డానని తెలిపారు.

కాగా 2019లో విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అహ్మద్ 100 ర్యాంక్ లో ఉన్నాడు. ఇక గతంలో పాల్గొన్న యూత్ ఒలంపిక్స్ లో 8వ స్థానంలో నిలిచాడు. ఇక ఇప్పటివరకు తునీషియా దేశం ఒలంపిక్స్ లో 5 స్వర్ణపతాకాలు గెలుచుకుంది. వీటిలో మూడు స్వర్ణాలు స్విమ్మింగ్ పోటీల్లో వచ్చాయి.