Ricky Ponting: విరాట్ కోహ్లీ ఆటతీరుపై రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు

 టీ20 క్రికెట్ అనేది వయసు ఎక్కువ ఉన్న, అనుభవం ఉన్న ప్లేయర్ల గేమ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. టీ20 ఫార్మాట్ ద్వారా విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చాడని, ప్రతికూల పరిస్థితులను అధిగమించాడని చెప్పారు. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ అని కితాబిచ్చారు. విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడంతో అతడి సాయంతో రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను సాధించవచ్చని భారత్ ఆశిస్తోందని చెప్పారు.

Ricky Ponting: విరాట్ కోహ్లీ ఆటతీరుపై రికీ పాంటింగ్ ప్రశంసల జల్లు

World T20I team top-5

Ricky Ponting: టీ20 క్రికెట్ అనేది వయసు ఎక్కువ ఉన్న, అనుభవం ఉన్న ప్లేయర్ల గేమ్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. టీ20 ఫార్మాట్ ద్వారా విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చాడని, ప్రతికూల పరిస్థితులను అధిగమించాడని చెప్పారు. విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఛాంపియన్ అని కితాబిచ్చారు. విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడంతో అతడి సాయంతో రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను సాధించవచ్చని భారత్ ఆశిస్తోందని చెప్పారు. 15 ఏళ్ల క్రితం టీమిండియా తొలి ప్రపంచ కప్ ను సాధించిందని గుర్తు చేశారు.

ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్స్ లోనూ కోహ్లీ అద్భుతంగా షాట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయని రికీ పాంటింగ్ చెప్పారు. అద్భుతమైన ఆటతీరుతో విరాట్ కోహ్లీ గతాన్ని గుర్తు చేస్తున్నాడని తెలిపారు. మ్యాచును గెలిపించే షాట్లు కొడుతున్నాడని చెప్పారు. పాక్ పై జరిగిన మ్యాచులో కోహ్లీ ఆడిన తీరును ప్రశంసించారు. కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడానికి అతడి కుటుంబ, జట్టు సభ్యుల మద్దతు కూడా కీలకంగా మారి ఉండొచ్చని చెప్పారు.

కోహ్లీకి కష్టపడేతత్వం ఉందని రికీ పాంటింగ్ అన్నారు. అతడు ఎల్లప్పుడూ ఫిట్ గా ఉంటాడని చెప్పారు. డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడని అన్నారు. కాగా, ఇవాళ కోహ్లీ 34వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లో కోహ్లీ ఆటతీరు మెరుగ్గా ఉండడంతో భారత్ కప్ పై భారీగా ఆశలు పెట్టుకుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..