T20 World Cup 2021 : సూపర్-12లో ఆసీస్ శుభారంభం…సౌతాఫ్రికాపై విజయం

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విక్టరీ కొట్టింది. 5 వికెట్ల తేడ

T20 World Cup 2021 : సూపర్-12లో ఆసీస్ శుభారంభం…సౌతాఫ్రికాపై విజయం

T20 World Cup 2021 Australia Beats South Africa

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఆసీస్ విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

ఆసీస్ బ్యాటర్లలో స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (16 బంతుల్లో 24 పరుగులు) మెరుపులు మెరిపించాడు. టార్గెట్ చిన్నదే అయినా.. చేజ్ చేసేందుకు ఆస్ట్రేలియా చెమటోడ్చాల్సి వచ్చింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే 2 వికెట్లు, రబాడా, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షంసీ తలో వికెట్ తీశారు.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

లక్ష్యఛేదనలో ఆసీస్ 20 పరుగులకే ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (0), డేవిడ్ వార్నర్ (14)ల వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ (11) కూడా వెనుదిరిగాడు. మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేసి స్కోరుబోర్డును నడిపించాడు. మ్యాక్స్ వెల్ 18 పరుగులు చేయగా, చివర్లో మాథ్యూ వేడ్ (15 నాటౌట్), స్టోయినిస్ (24 నాటౌట్) జోడీ మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో సఫారీలు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 118 పరుగులే చేసింది.

Black Guava : నల్లజామతో…వృద్ధాప్య ఛాయలకు చెక్..!

మిడిలార్డర్ లో దిగిన ఐడెన్ మార్ క్రమ్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో రబాడా 19 పరుగులు చేయగా, కెప్టెన్ టెంబా బవుమా 12, మిల్లర్ 16, క్లాసెన్ 13 పరుగులు చేశారు. స్టార్ ఆటగాడు డికాక్ (7), వాన్ డర్ డుస్సెన్ (2) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జోష్ హేజెల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్, పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.

టీ20 వరల్డ్ కప్ లో రెండో అంకానికి తెరలేచింది. నేటి నుంచి సూపర్-12 పోటీలు ప్రారంభం అయ్యాయి. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి.

స్కోర్లు..
సౌతాఫ్రికా-118/9
ఆస్ట్రేలియా-121/5 (19.4 ఓవర్లు)