T20 World Cup 2021 : శ్రీలంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

T20 World Cup 2021 : శ్రీలంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

T20 World Cup 2021 Australia

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన టార్గెట్ ను ఆస్ట్రేలియా 17 ఓవర్లలో మరో 18 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో(42 బంతుల్లో 65 పరుగులు) అదరగొట్టాడు. మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్(27) రాణించాడు. స్టీవెన్ స్మిత్ 28 పరుగులు, మార్కస్ స్టోయినస్ 16 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా రెండు వికెట్లు, షనక ఒక వికెట్ తీశారు.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లంక బ్యాట్స్ మెన్ లలో కుశాల్ పెరీరా(35), చరిత్ అసలంక(35), భానుక రాజపక్స (33-నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు తీశారు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

శ్రీలంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్లో ఓపెనర్‌ పీతమ్‌ నిశాంక (7) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసలంక.. మరో ఓపెనర్‌ కుశాల్ పెరీరాతో కలిసి వేగంగా ఆడాడు. దీంతో పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి శ్రీలంక స్కోరు 53/1 గా ఉంది. ధాటిగా ఆడుతున్న క్రమంలో ఆడమ్‌ జంపా వేసిన పదో ఓవర్లో అసలంక.. స్మిత్‌కి చిక్కాడు.

మిచెల్‌ స్టార్క్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే కుశాల్‌ పెరీరా కూడా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక స్కోరు నెమ్మదించింది. ఆ తర్వాత క్రీజులోకి అవిష్క ఫెర్నాండో (4), వాణిందు హసరంగ (4), దసున్‌ శనక (12) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన భానుక రాజపక్సే వేగంగా ఆడాడు. చమిక కరుణ రత్నే (9)
పరుగులు చేశాడు.

స్కోర్లు
శ్రీలంక-154/6
ఆస్ట్రేలియా-155/3(17ఓవర్లు)