T20 World Cup 2021 : వరల్డ్‌కప్ ఫైనల్.. దంచికొట్టిన కేన్… ఆస్ట్రేలియా టార్గెట్ 173

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

10TV Telugu News

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. బ్యాటింగ్ లో రాణించింది. ఆస్ట్రేలియా ముందు చాలెంజింగ్ టార్గెట్ ఉంచింది.

నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 48 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. మార్టిన్ గప్తిల్ 28, మిచెల్ 11, గ్లెన్ ఫిలిప్స్ 18, జేమ్స్ నీషమ్ 13 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 3 వికెట్లు తీశాడు. ఆడమ్ జంపా ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకోవాలంటే ఆస్ట్రేలియా 173 పరుగులు చేయాలి.

తొలి పది ఓవర్లకు కేవలం 57 పరుగులు సాధించిన కివీస్‌.. ఆఖరి పది ఓవర్లలో 115 పరుగులు రాబట్టింది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ (4 ఓవర్లలో 60) భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

Raja Ravindra : “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్ఐ

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మిచెల్‌ (8 బంతుల్లో 11 పరుగులు‌) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ కేన్‌తో కలిసి మార్టిన్‌ గప్తిల్ (28) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గప్తిల్‌ ఆసీస్‌ ఫీల్డర్‌ స్టాయినిస్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్స్ (18) తో కలిసి కేన్‌ విజృంభించాడు. తొలుత నిదానంగా ఆడిన కేన్‌.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 14వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్‌ విలియమ్సన్‌ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ సాధ్యపడలేదు. 85 పరుగుల దగ్గర హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ దగ్గర స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. దాంతో తొలిసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.

5 సార్లు వన్డే ప్రపంచకప్‌ సొంతం చేసుకున్నప్పటికీ అందని ద్రాక్షలా ఊరిస్తున్న తొలి టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా నిరీక్షిస్తోంది. వరుసగా గత రెండు వన్డే ప్రపంచకప్‌ల ఫైనల్లోనూ ఓడి ఈ ఏడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచి ఇప్పుడు పొట్టి కప్పు బోణీ కొట్టేందుకు న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు మేటి జట్లు పొట్టి ఫార్మాట్ లో విశ్వవిజేతగా నిలవాలన్న లక్ష్యంతో తుది పోరుకు సిద్ధమయ్యాయి. ఆఖరి యుద్ధంలో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయ్యాయి. హోరాహోరీగా జరిగే ఈ సమరంలో గెలిచి.. పొట్టి కప్పును తొలిసారి ముద్దాడేందుకు తహతహలాడుతున్నాయి.

కివీస్‌ కు.. ఇదే తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కాగా, ఆసీస్‌కి రెండో ఫైనల్‌. 2015 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన కివీస్‌.. ఇప్పుడా జట్టుపై ప్రతీకారం తీర్చుకుని ఈ ఏడాది రెండో ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విలియమ్సన్‌ సేన.. అదే ఊపులో పొట్టి కప్పునూ పట్టేయాలనుకుంటోంది. 2010 ఫైనల్లో ఇంగ్లాండ్‌ చేతిలో ఓడిన ఆసీస్‌.. ఈసారి మాత్రం ట్రోఫీని వదలకూడదనే పట్టుదలతో ఉంది.

టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే (2016లో) తలపడ్డాయి. అప్పుడు కివీస్‌ గెలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో ఈ రెండు జట్లు 14 మ్యాచుల్లో పోటీపడగా.. ఆసీస్‌ 9, కివీస్‌ 5 విజయాలు సాధించాయి.

×