T20 World Cup 2021 : పోలా.. అదిరిపోలా… వరల్డ్ కప్‌లో ఫ్యాన్స్ మధ్య సోషల్ డిస్టన్స్ కోసం స్పెషల్ అరేంజ్ మెంట్

కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్..

T20 World Cup 2021 : పోలా.. అదిరిపోలా… వరల్డ్ కప్‌లో ఫ్యాన్స్ మధ్య సోషల్ డిస్టన్స్ కోసం స్పెషల్ అరేంజ్ మెంట్

Fenced Sitting Arrangement

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ షురూ అయ్యింది. యూఏఈ వేదికగా మ్యాచులు జరుగుతున్నాయి. మ్యాచులు చూసి ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ వస్తున్నారు. అయితే, కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఏ క్షణంలో అయినా మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉంది. కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు సోషల్ డిస్టన్స్ మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఐసీసీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఫ్యాన్స్ మధ్య భౌతికదూరం పాటించేలా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేసింది. ఐసీసీ చేసిన సీటింగ్ అరేంజ్ మెంట్స్ కు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

ఫ్యాన్స్ కోసం ఫెన్స్ తో కూడిన ప్రత్యేక బాక్సులు(ఎన్ క్లోజర్) ఏర్పాటు చేసింది ఐసీసీ. ఒక్కో బాక్స్ కి మధ్య బాగా దూరం ఉంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులు ఆ బాక్సుల్లో కూర్చోవాలి. తమ బంధువులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇలా ఎవరితో వస్తే వారంతా తమకు కేటాయించిన ఫెన్స్ బాక్సుల్లోనే కూర్చోవాలి. ప్రస్తుతం ఈ తరహా సీటింగ్ ఏర్పాట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఐడియా చాలా బాగుందని, ఇలా సోషల్ డిస్టన్స్ మెయింటేన్ చేయడం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

WhatsApp: పది రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు.. పూర్తి లిస్ట్ ఇదే!

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. షేక్ జైద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఫ్యాన్స్ కోసం స్టేడియంలో ప్రత్యేక సీటింగ్ అరేంజ్ మెంట్స్ చేశారు. ఈ సీటింగ్ అరేంజ్ మెంట్స్ పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఓ మై గాడ్.. వాటిని చూస్తుంటే ఫార్మ్ విల్లే లా ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వరల్డ్ కప్ లో కరోనాకు చెక్ చెప్పినట్టే అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ఏర్పాట్లతో కరోనాకు చెక్ చెప్పినట్టే అని ఇంకొక నెటిజన్ అన్నాడు. కాగా, ఒక్కో ఫెన్సింగ్ బాక్స్ లో ముగ్గురు వ్యక్తులు కూర్చోవచ్చు. సాధారణంగా క్రికెట్ స్టేడియంలో అభిమానులు వరుసగా ఒకే లేన్ లో కూర్చుంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పెద్దగా భౌతిక దూరం ఉండదు. ప్రస్తుత కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అలాంటి సీటింట్ అరేంజ్ మెంట్ చాలా ప్రమాదకరం. అందుకే, సోషల్ డిస్టన్స్ మెయింటేన్ చేసేలా.. ప్రత్యేక బాక్సులు(ఫెన్స్ తో కూడినవి) తయారు చేసింది ఐసీసీ.