T20 World Cup 2021: టోర్నీలో టీమిండియాకు వచ్చిన సంపాదనెంతంటే..

టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నవంబర్ 14 ఆదివారం ఫైనల్ జరగనుంది. ఇరు జట్లు టోర్నీ మొత్తంలో కనబరిచిన ఆటతీరు చూస్తుంటే.. ఫైనల్ ఎంత రసవత్తరంగా జరుగుతుందోననే ఆసక్తి మరింత పెరిగిపోతుంది.

T20 World Cup 2021: టోర్నీలో టీమిండియాకు వచ్చిన సంపాదనెంతంటే..

Team India

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా నవంబర్ 14 ఆదివారం ఫైనల్ జరగనుంది. ఇరు జట్లు టోర్నీ మొత్తంలో కనబరిచిన ఆటతీరు చూస్తుంటే.. ఫైనల్ ఎంత రసవత్తరంగా జరుగుతుందోననే ఆసక్తి మరింత పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాలతో బరిలోకి దిగినా టీమిండియా.. సూపర్ 12 స్టేజిలో నుంచే టోర్నమెంట్ కు గుడ్ బై చెప్పేసింది.

3విజయాలు, 2ఓటములతో వైదొలగింది. అంతా వరల్డ్ కప్ గెలిస్తే ఎంత వస్తుందోనని ఆలోచించాం. మరి సూపర్ 12కే పరిమితమైన టీమిండియా ఎంత దక్కించుకుందో తెలుసా.. వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టుకు 5.6మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.41.63కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఐసీసీ.

సూపర్ 12 స్టేజిలో పార్టిసిపేట్ చేసినందుకుగానూ విరాట్ కోహ్లీ టీంకు.. 70వేల డాలర్లు అంటే రూ.52లక్షలు రానున్నాయి. అంతేకాకుండా ఇండియా ఆడిన ఐదు మ్యాచ్ లలో అఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించింది. ఐసీసీ లెక్కల ప్రకారం.. సూపర్ 12 స్టేజిలో గెలిచిన జట్టుకు ఒక్కో మ్యాచ్ కు రూ.29.73లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తారు. అలా టీమిండియాకు మొత్తం (52+89.19) 1.41కోట్లు వచ్చాయన్న మాట.

…………………………………….. : విశాఖ అభివృద్ధి చెందాలంటే వైసీపీని గెలిపించండి

టీమిండియా తన తర్వాతి మ్యాచ్ కోసం స్వదేశానికి వచ్చేసింది. కోహ్లీ ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేయగా.. రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు జట్టు మొత్తం జైపూర్ కు చేరుకుంది. నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుండగా, నవంబర్ 25నుంచి రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. టీమిండియాలో పలువురు సీనియర్లకు ఫార్మాట్ల వారీగా విశ్రాంతి కల్పించింది సెలక్షన్ ప్యానెల్.