T20 World Cup 2021: సిచ్యుయేషన్‌కు నేను సింక్ అవలేదు, మ్యాచ్‌కు ముందే పాండ్యా కామెంట్లు

హోరాహోరీ పోరులో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఊహించినట్లుగానే హార్దిక్ పాండ్యా స్థానం దక్కించుకున్నాడు.

10TV Telugu News

T20 World Cup 2021: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా.. పాక్ లు తలపడేందుకు సిద్ధం అయిపోయాయి. ఈ మేరకు హోరాహోరీ పోరులో ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఊహించినట్లుగానే హార్దిక్ పాండ్యా స్థానం దక్కించుకున్నాడు. చాలా కాలం తర్వాత పాండ్యా తిరిగి జట్టులోకి రావడం పట్ల ఇలా స్పందించాడు.

‘నేను పరిస్థితి ఎక్కువగా హైప్ చేయడం ఇష్టపడటం లేదు. మేమంతా అదే అనుకున్నాం. దీని కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే అలా చూడటం వల్ల ఎగ్జైట్ అయిపోతుంటాం. భావోద్వేగాలను దూరంగా పెడితేనే ఇది సులభం అవుతుంది. ప్రొఫెషనల్‌గా ఉండాలంటే ఇవి తప్పవు. ప్రస్తుతానికి బౌలింగ్ చేయాలనుకోవడం లేదు. బౌలింగ్ చేయాలని చెప్తే అప్పుడు చూస్తా’ అని చెప్పాడు పాండ్యా.

పాండ్యాను తీసుకోవాలంటూ హర్భజన్ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు హార్దిక్ పాండ్యాను తీసుకోవాలన్నారు.

‘నేనే టీం మేనేజ్మెంట్‌లో భాగమై ఉంటే.. బ్యాటర్ గా తనను కచ్చితంగా తీసుకునే వాడిని. అతనికి ఆ సామర్థ్యం ఉంది. చివరిగా 2లేదా 3 లేదా 4బంతులు ఎన్ని ఉన్నా 10 నుంచి 12పరుగులు తీసుకురాగలడు. అతణ్ని జట్టులో ఉంచాలి. బౌలింగ్ పరంగానూ.. జడేజా, బుమ్రా, షమీ, చక్రవర్తి లాంటి సాలిడ్ బౌలర్లతో జట్టు పటిష్ఠంగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు హర్భజన్.

………………………………………. : భారత్ బ్యాటింగ్… ఫైనల్ టీమ్స్ ఇవే

Teams:
India (Playing XI):
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(c), సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువీ, షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా

Pakistan (Playing XI):
బాబర్ అజాం(c), మొహమ్మద్ రిజ్వాన్(w), ఫఖర్ జమాన్, మొహమద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ ఆఫ్రిది