T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ.. రన్‌రేట్ మరింత మెరుగు

కీలక మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

T20 World Cup 2021 : స్కాట్లాండ్‌పై భారత్ సూపర్ విక్టరీ.. రన్‌రేట్ మరింత మెరుగు

T20 World Cup 2021 India Beats Sctoland

T20 World Cup 2021 : కీలక మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. తొలుత భారత బౌలర్లు చెలరేగగా, ఆ తర్వాత బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

స్కాట్లాండ్ నిర్దేశించిన 86 పరుగుల టార్గెట్ ను ఇండియా 6.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(16 బంతుల్లో 30.. 5 ఫోర్లు, ఒక సిక్స్), కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 50.. 5 ఫోర్లు, 3 సిక్స్ లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో భారత్ సునాయసంగా టార్గెట్ ను చేజ్ చేసింది. 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ 89 పరుగులు చేసింది.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ నిర్దేశించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్‌ మున్సీ (24), లీస్క్‌ (21) కాస్త ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్‌. కెప్టెన్‌ కోట్జర్‌ (1), క్రాస్‌ (2), గ్రీవ్స్‌ (1) సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్‌ 16, వాట్‌ 24 పరుగులు చేశారు.

EPFOలో వడ్డీ జమ అవుతుందో లేదో తెలుసా? మీ పాస్‌బుక్ చెక్ చేసుకోండిలా!

ఈ గెలుపుతో భారత్.. రన్ రేట్ ను మెరుగుపరుచుకుని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో భారత్‌ (4 పాయింట్లు) మూడో స్థానానికి చేరుకుంది. భారత్‌ నెట్‌ రన్‌ రేట్‌ (+1.619) అఫ్ఘానిస్తాన్‌ (+1.481) కంటే మెరుగైన స్థితికి చేరింది.