T20 World Cup 2021: India vs Pakistan Live Updates

ఈ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అటు పాకిస్తాన్ లోనూ...

10TV Telugu News
  • పాండ్యా అవుట్

     

    నెలల తరబడి నిరీక్షణ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పాండ్యా.. పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు. 8బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి హ్యారిస్ రౌఫ్ బౌలింగ్ లో బాబర్ అజామ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  • కోహ్లీ అవుట్

    వన్ డౌన్ లో దిగిన విరాట్ కోహ్లీ.. 18.4ఓవర్లకు 133 స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. 49 బంతులు ఆడిన కోహ్లీ 57పరుగులు చేసి షహీన్ అఫ్రీది బౌలింగ్ లో వెనుదిరిగాడు.

  • జడేజా అవుట్

    మ్యాచ్ ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జడేజా మొహమ్మద్ నవాజ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జట్టు 125 పరుగుల వద్ద జడేజా రెండు ఫోర్లు బాది 13 బంతులకు 13 స్కోరు చేసి అవుట్ అయ్యాడు.

  • 15 ఓవర్లకు ఇండియా స్కోర్ 100

    పరుగుల వేటలో భారత్ తడబాటు కొనసాగుతోంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 4 వికెట్ల నష్టానికి 100 రన్స్ చేసింది. కోహ్లీ 37… జడేజా 6 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

  • భారీ స్కూప్ కు ట్రై చేసి పంత్ ఔట్

    పంత్ స్పీడ్ తో టీమిండియా ఇన్నింగ్స్ కుదురుకున్నట్టే కనిపించింది. వికెట్ల పతనాన్ని కోహ్లీ, పంత్ కాసేపు అడ్డుకున్నారు. ఐతే.. ఈ మాత్రం రన్ రేట్ తో పరుగులు చేస్తే.. సరిపోదనేది అభిమానుల మాట. వికట్ కీపర్ రిషభ్ పంత్.. ఔట్ కు ముందు తన పంచ్ పవర్ ను చూపించాడు. హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్ లో 2,3 బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు పంత్. 12 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 3 వికెట్లకు 81 రన్స్ చేసింది. కోహ్లీ 28… పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

    ఐతే… 13 వ ఓవర్లో షాదాబ్ ఖాన్ వేసిన 13 ఓవర్ లో భారీ స్వీప్ షాట్ కు ట్రై చేసిన పంత్.. బంతిని గాల్లోకి లేపాడు. బౌలరే పరుగెత్తికెళ్లి క్యాచ్ పట్టుకున్నాడు. పంత్ 30 బాల్స్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 రన్స్ చేసి ఔటయ్యాడు.

  • పంత్ 2 సిక్సర్లు… కుదురుకున్న కోహ్లీ, పంత్

    టీమిండియా ఇన్నింగ్స్ కుదురుకున్నట్టు కనిపిస్తోంది. వికెట్ల పతనాన్ని కోహ్లీ, పంత్ అడ్డుకున్నారు. ఐతే.. ఈ మాత్రం రన్ రేట్ తో పరుగులు చేస్తే.. సరిపోదనేది అభిమానుల మాట. అందుకే… వికట్ కీపర్ రిషభ్ పంత్.. తన పంచ్ పవర్ ను చూపించాడు. హసన్ అలీ వేసిన ఇన్నింగ్స్ 12 వ ఓవర్ లో 2,3 బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు పంత్.

    12 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 3 వికెట్లకు 81 రన్స్ చేసింది. కోహ్లీ 28… పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 10 ఓవర్లకు 60 రన్స్

    టీమిండియా ఇన్నింగ్స్ సగం ముగిసేసరికి స్కోర్ బోర్డుపై సరిగ్గా ఆరు రన్ రేట్ తో 60 పరుగులు చేరాయి. 3 కీలక వికెట్ల నష్టపోయింది ఇండియా. కోహ్లీ 26, పంత్ 19 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

  • పాక్ రివ్యూ పోయింది

    హఫీజ్ వేసిన 8వ ఓవర్ లో రిషభ్ పంత్ ఔటయ్యే ప్రమాదం నుంచి ఎస్కేపయ్యాడు. క్యాచ్ కోసం పాక్ కీపర్ రిజ్వాన్ అప్పీల్ చేస్తే ఎంపైర్ నిరాకరించారు. దీంతో… రివ్యూ కోరింది పాక్.

  • 31 రన్స్ కే ఇండియా 3 వికెట్లు డౌన్

    పాకిస్తాన్ తో జరుగుతున్న సూపర్ 12 గ్రూప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లో ఇబ్బంది పడుతోంది.  5.4 ఓవర్లలో 31 రన్స్ కే 3 వికెట్లు కోల్పోయింది కోహ్లీ గ్యాంగ్. 8 బాల్స్ లో 11 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 3వ వికెట్ గా ఔటయ్యాడు. హసన్ అలీ బౌలింగ్ లో .. రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. ఇప్పటికే… ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు పెవీలియన్ చేరారు. కోహ్లీకి వికెట్ కీపర్ రిషభ్ పంత్ జతకలిశాడు.

  • సిక్సర్ తో ఆఫ్రిదికి బదులిచ్చిన కోహ్లీ

    ఆరంభంలోనే భారత ఓపెనర్లను ఔట్ చేసిన పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదికి విరాట్ కోహ్లీ గట్టిగా బదులిచ్చాడు. ఆఫ్రిది వేసిన 3వ ఓవర్ ఐదో బాల్ ను స్ట్రెయిట్ గా సిక్సర్ గా బాదాడు. దీంతో… టీమిండియా అభిమానులు, ప్రేక్షకుల్లో కొండంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక కోత మొదలైంది… రాత రాసిన వాడు వచ్చినా కోహ్లీని ఆపలేడు అంటున్నారు ఫ్యాన్స్.

  • కేఎల్ రాహుల్ ఔట్… ఫైర్ మీదున్న ఆఫ్రిది

    తన రెండోఓవర్ లో భారత్ ను మరో దెబ్బకొట్టాడు పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది. రెండో ఓవర్ లో తొలి బంతికే కేఎల్ రాహుల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తాను వేసిన మొదటి ఓవర్ లో నాలుగో బంతికి…. రోహిత్ శర్మను ఔట్ చేసి తొలి దెబ్బతీశాడు ఆఫ్రిది. రోహిత్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ కే ఎల్బీగా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.

  • రోహిత్ డకౌట్

    టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 0.4 ఓవర్లకే అవుట్ అయి వెనుదిరిగాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసిన తర్వాత అవుట్ కావడంతో వన్ డౌన్ లో కోహ్లీ బరిలోకి దిగాడు.

  • ఇండియా, పాకిస్తాన్ ఫైనల్ టీమ్స్ ఇవే

    Teams:
    India (Playing XI):
    రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(c), సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువీ, షమీ, వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా

    Pakistan (Playing XI):
    బాబర్ అజాం(c), మొహమ్మద్ రిజ్వాన్(w), ఫఖర్ జమాన్, మొహమద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వాసిమ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ ఆఫ్రిది

  • T20 World Cup 2021: టీమిండియా బ్యాటింగ్

    ఇండియాతో మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచింది. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. భారత్ బ్యాటింగ్ కు దిగనుంది.

  • మ్యాచ్ టఫ్‌గానే ఉంటుంది.. లైట్ తీసుకోవద్దు

    పాకిస్తాన్ ను లైట్ తీసుకోవద్దని చెప్పారు హైదరాబాదీ క్రికెట్ కోచ్ సయ్యద్. వారి బలాబలాలను అంచనా వేస్తూ ఎత్తుగడలు వేస్తే.. ఇండియా గెలుపు ఖాయమన్నారు. ఇండియా విజయంపై సందేహం లేకపోయినప్పటికీ… పాక్ ను మాత్రం లైట్ తీసుకోవద్దంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్. పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా లెజెండరీ ప్లేయర్ మాథ్యూ హేడెన్ కోచ్ గా ఉన్నాడని గుర్తుచేస్తున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేశ్.