T20 World Cup 2021: కంటతడి పెట్టిన పాక్ కెప్టెన్ తండ్రి.. ‘మైదానమంతా బాబర్‌దే’

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రమే కాకుండా.. చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న టీమిండియాపై ఘన విజయం పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోయే సందర్భం.

T20 World Cup 2021: కంటతడి పెట్టిన పాక్ కెప్టెన్ తండ్రి.. ‘మైదానమంతా బాబర్‌దే’

Pakistan Captain

T20 World Cup 2021: పాకిస్తాన్ క్రికెట్ టీం పది వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించడాన్ని ఆ దేశ అభిమానులు భారీ ఎత్తులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో మాత్రమే కాకుండా.. చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న టీమిండియాను ఢీకొనడం, అది కూడా ఘన విజయం సాధించడం పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోయే సందర్భం ఇది.

జట్టు విజయం సాధించిన క్షణాల్లో బాబర్ అజామ్ తండ్రి.. కన్నీటి పర్యంతం అయ్యారు. ఎమోషనల్ అవుతుంటే చుట్టూ ఉన్న అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తుండటం, మరికొందరు అభినందిస్తుండటంతో వారికి రెస్పాన్స్ ఇస్తూనే కన్నీరు పెట్టుకుని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇదంతా మజహర్ అర్షద్ అనే వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్టు చేశాడు.

‘ఇక్కడ కనిపిస్తుంది బాబర్ అజామ్ ఫాదర్. అతణ్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అతణ్ని ఒక రిసెప్షన్ లో తొలిసారిగా కలిశాను. అప్పటికీ పాకిస్తాన్ టీంలో బాబర్ ఎంట్రీ అవడానికి మూడేళ్ల ముందు సంగతి ఇది. అతని తండ్రి అప్పుడు మాట్లాడుతూ.. ఒకసారి ఎంట్రీ ఇవ్వనివ్వు. మొత్తం మైదానమంతా బాబర్‌దే’ అని నమ్మకంతో చెప్పాడని గుర్తు చేసుకున్నాడు ఈ అర్షద్.

……………………………………….. : మొలకెత్తిన పెసలు తినటం ఆరోగ్యానికి మంచిదా?..

మ్యాచ్ కు ముందు టాస్ గెలిచిన తర్వాత మాట్లాడిన బాబర్ అజామ్.. ‘వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టి.. ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ సెషన్స్ కూడా బాగా జరిగాయి. మా ప్రిపరేషన్ మీద మాకు నమ్మకముంది. పాకిస్తాన్ బౌలర్లు ఇతర జట్లను ఒత్తిడిలోకి నెడతాయన్నట్లే.. మ్యా బ్యాటింగ్ పై కూడా నమ్మకం ఉంది’ అని మ్యాచ్ కు ముందు చెప్పాడు పాక్ కెప్టెన్.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచిన తర్వాత షహీన్ అఫ్రీది.. 6/2తో జట్టులో పాక్ జట్టులో ఉత్సాహాన్ని పెంచారు. రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం, ఆ తర్వాతే రాహుల్ పెవిలియన్ బాటపట్డం, సూర్యకుమార్ యాదవ్ 6,4 బాది హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో 57పరుగులు చేయడంతో ఇండియా 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసింది. చేధనలో పాక్ ఓపెనర్లు 152పరుగులు లక్ష్యాన్ని అవలీలగా సాధించారు.