T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ల మధ్య టాస్ ఎంపికలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. దుబాయ్ వేదికగా జరిగిన పోరులో విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‌లో తొలి కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు

Virat Kohli

T20 World Cup 2021: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ల మధ్య టాస్ ఎంపికలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. దుబాయ్ వేదికగా జరిగిన పోరులో విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేసి జట్టును 150పరుగులు దాటించాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆరంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంది. రోహిత్ శర్మ డకౌట్ గా వెనుదిరగడం, కొద్ది విరామంతోనే కేఎల్ రాహుల్ అవుట్ అవడం ఒత్తిడిలోకి నెట్టేసింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు వన్ డౌన్ గా వచ్చిన కోహ్లీ 49బంతుల్లో.. 57పరుగులు నమోదు చేశాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. అలా పాకిస్తాన్ జట్టు ముందు 152పరుగుల టార్గెట్ ఉంచాడు.

తొలి కెప్టెన్‌గా రికార్డు:
టీ20 వరల్డ్ కప్ లో 50పరుగులకు మించిన స్కోరు చేసిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. మిగతా హాఫ్ సెంచరీలన్నీ ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే బాదాడు విరాట్.

క్రిస్ గేల్ రికార్డు

29వ టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ లో క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర ప్లేయర్ రికార్డును బ్రేక్ చేశాడు.

./…………………………. : విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పాకిస్తాన్ టార్గెట్ 152

టీ20వరల్డ్ కప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు
విరాట్ కోహ్లీ – 10
క్రిస్ గేల్ – 9
జయవర్దనె – 7

దురదృష్టవశాత్తు 19వ ఓవర్లోనే షహీన్ అఫ్రీది వేసిన స్లో డెలివరీకి.. కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ కు చిక్కీ.. అవుట్ అయ్యాడు కోహ్లీ.