T20 World Cup 2021: న్యూజిలాండ్‌కు మరో షాక్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందే

మంగళవారం టీ20 వరల్డ్ కప్లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ మరోసారి గెలవడంతో న్యూజిలాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. అదే మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్..

T20 World Cup 2021: న్యూజిలాండ్‌కు మరో షాక్.. టీమిండియాతో మ్యాచ్‌కు ముందే

Team India

T20 World Cup 2021: టీమిండియాతో ఆదివారం న్యూజిలాండ్ కు ఆదివారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కివీస్ జట్టుకు షాక్ తగిలింది. మంగళవారం టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‎లో పాక్ మరోసారి గెలవడంతో న్యూజిలాండ్ జట్టుకు ఓటమి తప్పలేదు. అదే మ్యాచ్ లో స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ కాలి బొటనవేలికి గాయం అయినట్లు తెలుస్తుంది.

ఈ గాయంతో ఆదివారం మ్యాచ్ ‎కు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి అతను ఇబ్బంది పడ్డాడని కోచ్ గ్యారీ స్టెడ్ మ్యాచ్ తర్వాత వెల్లడించారు. కాలి బొటనవేలి గాయంపై 24 నుంచి 48 గంటలు గడిస్తేనే గానీ చెప్పలేమని చెబుతున్నారు.

పేస్‌మెన్ లాకీ ఫెర్గూసన్ మంగళవారం కాలు కండరం చిట్లడంతో టోర్నమెంట్ నుండి వైదొలిగారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడాల్సిన సమయంలో్ ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేని ఐసీసీ టెక్నికల్ కమిటీ అనుమతించాలని అడిగితే నిరాశే ఎదురైంది.

…………………………………………… : ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత.. మంత్రి కీలక ప్రకటన

‘ఇది మమ్మల్ని నిరుత్సాహపరిచింది ఎందుకంటే ఆడమ్ మిల్నే ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి. వారి నిర్ణయంపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నాం. గ్రూప్‌ 2లో పాకిస్తాన్ ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా నంబర్ వన్ సీడ్‌గా ఉందని అనుకోవచ్చు. మా జట్టులో మిల్నేను ఆడనివ్వకపోతే ఇండియాతో మ్యాచ్ సంక్లిష్టంగా మారుతుంది’ అని అంటున్నాడు.

పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది పాకిస్తాన్‌.