T20 World Cup 2021 : చివర్లో చెలరేగిన న్యూజిలాండ్.. నమీబియా టార్గెట్ 164

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. భారీ స్కోరు

T20 World Cup 2021 : చివర్లో చెలరేగిన న్యూజిలాండ్.. నమీబియా టార్గెట్ 164

T20 World Cup 2021

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా షార్జా వేదికగా న్యూజిలాండ్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు చేసింది. భారీ స్కోరు సాధించకుండా న్యూజిలాండ్ ను నమీబియా బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో 18 పరుగులు రావడంతో కివీస్ స్కోరు 150 మార్కు దాటింది. ఆరంభంలో కట్టడి చేసిన నమీబియా.. ఆఖర్లో పట్టు సడలించడంతో కివీస్‌ మంచి స్కోరు చేయగలిగింది.

Watermelon Seeds : పుచ్చగింజలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా?

సెమీస్‌ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే కివీస్‌ తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాప్‌-ఆర్డర్‌ దూకుడుగా ఆడలేకపోయింది. ఓ దశలో కివీస్ జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా… గ్లెన్ ఫిలిప్స్ (39 నాటౌట్), జేమ్స్ నీషామ్ (35 నాటౌట్) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడారు. ఫిలిప్స్ 3 సిక్సులు బాదగా, నీషామ్ 2 సిక్సులు కొట్టాడు.

అంతకుముందు, ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ 18, డారిల్ మిచెల్ 19 పరుగులు చేశారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 28 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ కాన్వే 17 పరుగులకు అవుటయ్యాడు. నమీబియా బౌలర్లలో స్కోల్జ్ , వీజ్ , ఎరాస్మస్ తలో వికెట్ తీశారు.

Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!

అఫ్ఘాన్‌ మీద భారీ ఇన్నింగ్స్‌ ఆడిన న్యూజిలాండ్‌ ఓపెనర్ మార్టిన్‌ గప్తిల్ ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ధాటిగా ఆడలేకపోయాడు. ఆఖర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (39.. ఒక ఫోర్‌, 3 సిక్సులు), నీషమ్‌ (35.. ఒక ఫోర్‌, రెండు సిక్సులు) వేగంగా ఆడటంతో ఈ స్కోరునైనా న్యూజిలాండ్‌ సాధించగలిగింది. ఈ జోడీ చివరి 4 ఓవర్లలో 67 పరుగులు రాబట్టింది. 12 ఓవర్లకు 81/1గా ఉన్న కివీస్‌ స్కోరు 160 దాటిందంటే వీరిద్దరి చలవే. ఆఖర్లో బ్యాటర్లు హిట్టింగ్‌కు దిగడంతో ప్రత్యర్థి ముందు చాలెంజింగ్ టార్గెట్ ను ఉంచగలిగారు.