T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో ఫస్ట్ టైమ్.. ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్

టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన పోరులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి..

T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో ఫస్ట్ టైమ్.. ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్

T20 World Cup 2021 New Zealand Final

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ తో జరిగిన పోరులో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారిగా ఫైనల్ కి చేరింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 167 పరుగుల టార్గెట్ ను 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.

కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డారెల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. 4 సిక్సులు, 4 ఫోర్లు బాదాడు. తొలిసారి జట్టును ఫైనల్ కి చేర్చాడు. మరో ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌(4), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ తర్వాత వచ్చిన డెవన్‌ కాన్వే (46) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో జేమ్స్ నీషమ్( 11 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 27 పరుగులు) రాణించాడు. కివీస్‌ను ఒత్తిడి నుంచి బయటపడేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు తొలుత బాగానే బౌలింగ్ చేసినా.. చివరల్లో చేతులెత్తేశారు.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు తీశారు. అదిల్ రసీద్ ఒక వికెట్ తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. గురువారం పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగే సెమీఫైనల్‌ 2 విజేతతో ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్లుతక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన డేవిడ్‌ మలన్‌(41) రాణించాడు. మలన్‌ ఔటైన తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అలీ ఓవరాల్‌గా 51 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ (29) రాణించారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, ఇష్‌ సోధీ, ఆడమ్‌ మిల్నే, నీషమ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.

2016 టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.

WhatsApp Status Trick : వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చేయడం ఇంత ఈజీనా..!

టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి వేళైంది. నాకౌట్‌ పోరాటాలకు తెరలేచింది. బుధవారం తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ తలపడ్డాయి. టైటిల్‌ ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగింది. గ్రూప్‌-1లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది.

మరోవైపు నిలకడగా రాణిస్తున్న కివీస్‌ సైతం అటు గ్రూప్‌- 2లో 5 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి.. ఒక దాంట్లో ఓడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఇప్పటికే ఓ సారి పొట్టి కప్పు (2010)ను ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్‌.. రెండో టైటిల్‌ కి అడుగు దూరంలో ఆగిపోయింది. కివీస్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 11వ తేదీన పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్‌ జరగనుంది. సెమీస్‌లో గెలిచిన జట్టు నవంబర్‌ 14న మెగా ఫైనల్‌లో న్యూజిలాండ్ తో తలపడనుంది.