T20 World Cup 2021: తొలి మ్యాచ్‌లో ఒమన్ అద్భుతమైన విజయం.. తెలుగు కుర్రాడికి దక్కని అవకాశం

టీ20 వరల్డ్‌కప్ 2021 లో తొలి మ్యాచ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది ఒమన్. ఆరంభ మ్యాచ్‌లో తొలిసారి అర్హత సాధించిన ఉత్సాహంతో చెలరేగింది.

T20 World Cup 2021: తొలి మ్యాచ్‌లో ఒమన్ అద్భుతమైన విజయం.. తెలుగు కుర్రాడికి దక్కని అవకాశం

T20 World Cup 2021

T20 World Cup 2021: టీ20 వరల్డ్‌కప్ 2021 లో తొలి మ్యాచ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది ఒమన్. ఆరంభ మ్యాచ్‌లో తొలిసారి అర్హత సాధించిన ఉత్సాహంతో చెలరేగింది. పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్ధి నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండానే సాధించేసింది. ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌ 50, జితేందర్‌ సింగ్73 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు.

నాలుగు వికెట్లతో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చిన ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఒమన్ జట్టు క్రికెటర్ అయిన సందీప్ గౌడ్ తుదిజట్టులో సభ్యుడుగా ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఐదేళ్ల విరామం తర్వాత 16జట్లు హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయిన టోర్నీ ఆదివారంతో మొదలైంది. తొలి రోజు బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ల మధ్య కూడా మ్యాచ్ జరిగింది.

ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూప్-బీలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి. ఆ తర్వాత ప్రధాన జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్‌ 23 నుంచి స్టార్ట్ అవుతాయి.

……………………………………………………బీసీసీఐలో పెద్ద ఉద్యోగాలు.. 9రోజుల్లోగా అప్లై చేసుకోవాలి

గ్రూప్ ఏ – శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బీ – బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్

గ్రూపు ఒక జట్టు మిగిలిన జట్లతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. అలా ముగిసిన తర్వాత రెండు గ్రూప్‌ల నుంచి తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి రౌండ్( సూపర్ 12)కు చేరుకుంటాయి. అక్కడ ఎనిమిది టాప్ రేంజ్ టీంలతో రెండింటిని కూడా కలిపి రెండు గ్రూపులుగా విభజిస్తారు.

గ్రూప్ 1: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, A1, B2
గ్రూప్ 2: భారత్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, B1, A2

ప్రతి జట్టు గ్రూపులోని ఇతర జట్టుతో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. అలా రెండు గ్రూప్‌ల నుంచి టాప్ 2 స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గ్రూప్‌ దశలో గెలిచిన జట్టుకు రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మ్యాచ్ టై అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.