T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో భారత్‌కు బిగ్ షాక్.. సంచలన విజయంతో పాక్ హిస్టరీ

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్ పై విజయం సాధించింది. వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండ్ షో తో అ

T20 World Cup 2021 : వరల్డ్ కప్‌లో భారత్‌కు బిగ్ షాక్.. సంచలన విజయంతో పాక్ హిస్టరీ

T20 World Cup 2021 Pakistan Beats India

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్.. భారత్ కు బిగ్ షాక్ ఇచ్చింది. సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత్ పై విక్టరీ కొట్టింది పాక్. వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టింది. తొలుత పాక్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఆ తర్వాత బ్యాటర్లు చెలరేగిపోయారు. దీంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో భారత్ పై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

భారత్ నిర్దేశించిన 152 పరుగుల టార్గెట్ ను పాక్ సునాయసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే టార్గెట్ ను చేజ్ చేయడం విశేషం. పాక్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ ( 55 బంతుల్లో 79 పరుగులు-నాటౌట్), బాబర్ ఆజమ్ ( 52 బంతుల్లో 68 పరుగులు-నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. పాక్ బ్యాట్స్ మెన్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ధారాళంగా పరుగులు ఇచ్చారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లి సేనను పాక్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. బంతితో నిప్పులు చెరిగారు. ముఖ్యంగా 21 ఏళ్ల పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ భారత్ ను వణికించాడు. మూడు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి) తీసి దెబ్బకొట్టాడు. ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులే చేయగలిగింది.

ఆదిలోనే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రాహుల్(3) ఔటయ్యాడు. 6 పరుగులకే ఇండియా రెండు వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది. ఇండియా ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి గురయ్యారు. టాప్ ఆర్డర్ విఫలం అయినా విరాట్ కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో(57) ఒంటరి పోరాటం చేశాడు. పంత్ 39, జడేజా 13, పాండ్యా 11, సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అఫ్రిదీ 3 వికెట్లు, హసల్ అలీ 2 వికెట్లు, షాదాబ్ ఒక వికెట్ తీశారు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

భారత్ చాలెంజింగ్ స్కోర్ చేసింది, మరేం భయం లేదు, పాకిస్తాన్ పై గెలుస్తాం అని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, వారి ఆశలు ఆవిరయ్యాయి. భారత బౌలర్లు తేలిపోయారు. పాక్ బౌలర్లు నిప్పులు చెరిగిన పిచ్ పై భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పాక్ చేతిలో భారత్ ఓటమి ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్తాన్ కు ఇదే తొలి విజయం.

2007 నుంచి టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ భారత్, పాక్ జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఈ ఐదింట్లోనూ టీమిండియానే విజయం
సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌లోనే కాదు.. వన్డే ప్రపంచకప్‌లోనూ ఇప్పటి వరకూ భారత్‌ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఓడించలేకపోయింది.
ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో పాక్‌పై 12-0తో అజేయ రికార్డ్‌ని టీమిండియా కొనసాగిస్తుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారి ఆశలు ఆవిరయ్యాయి. భారత్ ను ఓడించి పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది.

స్కోర్లు..
భారత్ – 151/7
పాకిస్తాన్ – 152/0(17.5ఓవర్లు)