T20 World Cup 2021: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. 8వికెట్ల తేడాతో లంక విజయం

టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో లంక దెబ్బకు నెదర్లాండ్స్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఈ ఓటమితో చెత్త రికార్డును నెత్తినేసుకున్న నెదర్లాండ్స్.. టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫయర్స్ గ్రూప్

T20 World Cup 2021: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. 8వికెట్ల తేడాతో లంక విజయం

T20 World Cup 2021

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో లంక దెబ్బకు నెదర్లాండ్స్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఈ ఓటమితో చెత్త రికార్డును నెత్తినేసుకున్న నెదర్లాండ్స్.. టీ20 వరల్డ్ కప్ 2021 క్వాలిఫయర్స్ గ్రూప్ – ఏలో భాగంగా నెదర్లాండ్స్ శుక్రవారం లంకతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో నమోదైన స్కోరు టోర్నీ మొత్తానికే కనీస స్కోరు అయ్యేలా కనిపిస్తుంది 44పరుగులకే చాప చుట్టేసింది.

2014లోనూ ఇదే పరిస్థితి:
2014 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టుపై కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయిన నెదర్లాండ్స్‌.. టోర్నీ చరిత్రలో తొలి రెండు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు లిఖించింది.

మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించింది. స్పిన్నర్లు వనిందు హసరంగ(3/9), మహీశ్‌ తీక్షణ(2/3), పేసర్లు లహీర్ కుమార(3/7), దుశ్శంత చమీరా(1/13) చెలరేగి బౌల్‌ చేయడంతో నెదర్లాండ్స్‌ చిగురుటాకులా వణికిపోయి 10 ఓవర్లు మాత్రమే ఆడి 44 పరగులకే ఆలౌటైంది.

……………………………….: భారత్ గెలిచి ఎనిమిదేళ్లు.. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ గురించి సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో కొలిన్‌ ఆకెర్‌మెన్‌(11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. నెదర్లాండ్స్‌ స్కోర్‌లో 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. గ్రూప్‌-ఏ నుంచి శ్రీలంక ఇదివరకే సూపర్‌ 12 బెర్త్‌ ఖరారు చేసుకోగా.. నెదర్లాండ్స్‌ ఈ మ్యాచ్‌తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.