T20 World Cup 2021 : 55 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) వెస్టిండీస్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. దారుణంగా విఫలం అయ్యారు.

T20 World Cup 2021 : 55 పరుగులకే వెస్టిండీస్ ఆలౌట్

T20 World Cup 2021 West Indies

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) వెస్టిండీస్, ఇంగ్లాండ్ తలపడ్డాయి. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఎవరూ ఊహించని విధంగా దారుణమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. విండీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లు నిప్పులు చెరగడంతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. విండీస్ 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

T20 World Cup 2021 : ఇండియా పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. అప్పుడే బెట్టింగ్‌ షురూ

క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే ఆ జట్టులో హయ్యస్ట్ స్కోర్. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు తీశాడు. మోయిన్ అలీ, మిల్స్ తలో రెండు వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ తీశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కరీబియన్లు 14.2 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ నుంచి టెయిలెండర్ రవి రాంపాల్ వరకు అందరూ ఘోరంగా విఫలం అయ్యారు.