T20 World Cup 2021 : చివరి బంతికి ఫోర్ కొట్టలేకపోయిన బంగ్లా కెప్టెన్… ఉత్కంఠ పోరులో విండీస్‌దే గెలుపు

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విండీస్ మూడు పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. చివరి బంతికి ఫోర్ కొడితే

T20 World Cup 2021 : చివరి బంతికి ఫోర్ కొట్టలేకపోయిన బంగ్లా కెప్టెన్… ఉత్కంఠ పోరులో విండీస్‌దే గెలుపు

T20 World Cup 2021 West Indies

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో విండీస్ మూడు పరుగుల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. చివరి బంతికి ఫోర్ కొడితే గెలుస్తారనగా, బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా బలంగా బ్యాట్ ఊపినా బంతికి తగల్లేదు. దాంతో వెస్టిండీస్ అనూహ్యరీతిలో విజేతగా నిలిచింది.

PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 

లో స్కోర్ల మ్యాచ్ లో బంగ్లాదేశ్ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టే వెస్టిండీస్ ఫీల్డర్లు అనేక క్యాచ్ లు వదిలి బంగ్లా బ్యాటర్లకు హెల్ప్ చేశారు. రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ లోనూ మిస్ ఫీల్డింగ్ కొనసాగింది. అయితే ఆఖరి బంతిని రస్సెల్ ఎంతో పకడ్బందీగా ఆఫ్ సైడ్ వేయడంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా నిస్సహాయుడయ్యాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేయగా…. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులే చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో లిటన్ దాస్ 44 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మదుల్లా 31 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. విండీస్ బౌలర్లలో రాంపాల్, హోల్డర్, రస్సెల్, హోసీన్, బ్రావో తలో వికెట్ తీశారు.

Vitamin Deficiency : ఆ.. విటమిన్ లోపిస్తే… మతిమరుపు, గుండె సమస్యలు..!

సూపర్-12 దశలో గ్రూప్-1లో 3 మ్యాచ్ లు ఆడిన విండీస్ కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్ లో ఓడిపోయుంటే విండీస్ నాకౌట్ ఆశలు గల్లంతయ్యేవి. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయనప్పటికీ.. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని వెస్టిండీస్‌ కట్టడి చేసింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌ (6), క్రిస్ గేల్‌ (4) ఘోరంగా విఫలమయ్యారు. మూడో ఓవర్లో లూయిస్‌ క్యాచ్‌ ఔట్‌ కాగా.. ఐదో ఓవర్లో గేల్ బౌల్డయ్యాడు. దీంతో పవర్‌ ప్లే (6 ఓవర్లు) పూర్తయ్యే సరికి వెస్టిండీస్‌ స్కోరు 29/2గా ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్‌ వచ్చిన షిమ్రోన్‌ హెట్ మైర్‌ (9), ఆండ్రూ రస్సెల్‌ (0), డ్వేన్‌ బ్రావో (1) కూడా రాణించలేదు. అరంగేట్ర ఆటగాడు రోస్టన్ ఛేజ్‌ (39), ఆఖర్లో వచ్చిన నికోలస్‌ పూరన్ (40; 22 బంతుల్లో 1×4, 4×6) ఆదుకున్నారు. జేసన్‌ హోల్డర్‌ (15), పొలార్డ్‌ (14) నాటౌట్‌గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో మెహెదీ హసన్‌, షొరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ తలో రెండు వికెట్లు తీశారు.