T20 World Cup 2022: ఈ నెల 10న ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో తలపడనున్న టీమిండియా

గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఏడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా నవంబరు 10న తలపడనుంది. అలాగే, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ నవంబరు 9న పోటీ పడనుంది. ఈ సెమీఫైనల్స్ లో గెలిచిన జట్లు నవంబరు 13న ఫైనల్ లో ఆడతాయి. టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్‌మన్ గా విరాట్ కోహ్లీ (246)కొనసాగుతున్నాడు.

T20 World Cup 2022: ఈ నెల 10న ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో తలపడనున్న టీమిండియా

T20 World Cup 2022: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తుండడంతో టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా అసాధారణ ఆటతీరు ప్రదర్శిస్తోంది. సూపర్-12 దశలో 12 జట్లలో ఏ టీమ్ కూ లేనన్ని పాయింట్లను సంపాదించింది. ఇవాళ బింబాబ్వేతో జరిగిన మ్యాచులో 71 పరుగులతో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్-బీలో టీమిండియాకు 8 పాయింట్లు వచ్చాయి.

గ్రూప్-బీలో 6 పాయింట్లతో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఇక గ్రూప్-ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఏడేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టుతో టీమిండియా నవంబరు 10న తలపడనుంది. అలాగే, గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో పాకిస్థాన్ నవంబరు 9న పోటీ పడనుంది. ఈ సెమీఫైనల్స్ లో గెలిచిన జట్లు నవంబరు 13న ఫైనల్ లో ఆడతాయి. టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు తీసిన బ్యాట్స్‌మన్ గా విరాట్ కోహ్లీ (246 పరుగులు) ఉన్నాడు.

ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. టీమిండియా 2007లో టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. టీ20 ఫార్మాట్ లో నిర్వహించిన తొలి ప్రపంచ కప్ అది. అప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా మరోసారి కప్పును గెలుచుకోలేదు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తుండడం, ఫీల్డింగ్ లోనూ భారత్ పటిష్ఠంగా ఉండడంతో ఈ సారి ప్రపంచ కప్ పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..