Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా బూమ్రా..?

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు

Jasprit Bumrah: భారత జట్టు కెప్టెన్‌గా బూమ్రా..?

Bumra

Jasprit Bumrah: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లి వారసుడిగా జస్ప్రీత్ బుమ్రాను పెట్టాలంటూ అభిప్రాయపడుతున్నారు టీమిండియా వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా. ఒక దశాబ్దం పాటు భారత బౌలింగ్ యూనిట్‌కు ప్రధానమైన బౌలర్‌గా బాధ్యతగా ఉండే జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డారు నెహ్రా.

టీ20 ప్రపంచకప్‌‌లో మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కెప్టెన్‌గా తప్పుకోనున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్‌ను BCCI వచ్చే వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు బౌలర్ పనికిరాడా? పేసర్ సామర్థ్యాన్ని తక్కువగా చూస్తున్నారనే భావనను నెహ్రా ప్రశ్నించాడు. ఎప్పుడూ బ్యాట్స్‌మెన్లనే కెప్టెన్‌లుగా చూస్తున్నారని, బౌలర్లు బాధ్యతలు తీసుకోలేరా? అని ప్రశ్నించారు. బుమ్రాకు కెప్టెన్‌గా చేసే నైపుణ్యం ఉందన్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, KL రాహుల్ పేర్లు కూడా కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్ నుంచి భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కొత్త కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కోచ్‌గా రవిశాస్త్రి, టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఈ టోర్నీకి ఎవరు కెప్టెన్‌గా సెలెక్ట్ అవుతారు అనేదానిపై ఆసక్తి నెలకొని ఉంది.