T20 World Cup : ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసిం

T20 World Cup : ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం

T20 World Cup Australia Vs South Africa

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా శనివారం(అక్టోబర్ 23,2021) ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అబుదాబిలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో సఫారీలు స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 118 పరుగులే చేసింది.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

మిడిలార్డర్ లో దిగిన ఐడెన్ మార్ క్రమ్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో రబాడా 19 పరుగులు చేయగా, కెప్టెన్ బవుమా 12, మిల్లర్ 16, క్లాసెన్ 13 పరుగులు చేశారు. స్టార్ ఆటగాడు డికాక్ (7), వాన్ డర్ డుస్సెన్ (2) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, జోష్ హేజెల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2 వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ , పాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

టీ20 వరల్డ్ కప్ లో రెండో అంకానికి తెరలేచింది. నేటి నుంచి సూపర్-12 పోటీలు ప్రారంభం అయ్యాయి. కాగా, ఈ రెండు జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. ఇవి కాక ఈ గ్రూపులో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి.