T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు.. ఇంగ్లండ్ టార్గెట్ 138

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు చేసింది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది.

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు.. ఇంగ్లండ్ టార్గెట్ 138

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య ఫైనల్‌ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ పాకిస్తాన్‌ను బ్యాటింగ్‪కు ఆహ్వానించింది.

Pawan Kalyan: జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు.. కాలనీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదు: పవన్ కల్యాణ్

దీంతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో కెప్టెన్ బాబర్ ఆజామ్ (32), షాన్ మసూద్ (38) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వీరిద్దరి తర్వాత షాదాబ్ ఖాన్ (20), రిజ్వాన్ (15) పరుగులు మాత్రమే చేసి పర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఒక వికెట్ తీయగా, కరెన్ 3 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు, క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశారు.

ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అలెక్స్ హేల్స్ (1) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ ఉన్నారు.