T20 World Cup IndVsBan : ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం.. సెమీస్ అవకాశాలు మెరుగు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్‌ (6) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

T20 World Cup IndVsBan : ఉత్కంఠపోరులో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం.. సెమీస్ అవకాశాలు మెరుగు

T20 World Cup IndVsBan : టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. 5 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ణయించారు.

భారత్ నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 7 ఓవర్లకు 66 పరుగులు చేసిన తరుణంలో మ్యాచ్ కు కాసేపు వర్షం ఆటంకం కలిగించింది.

దీంతో బంగ్లా టార్గెట్ ను 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. కానీ, బంగ్లా 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 146 రన్స్ కే పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిట్టన్ దాస్ రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లను దంచి కొట్టాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు విజయం బంగ్లావైపే ఉంది. అయితే అతడు 60 పరుగుల దగ్గర రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్, పాండ్యా తలో 2 వికెట్లు తీశారు. షమీ ఒక వికెట్ తీశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

చివరి ఓవర్‌ వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లా 7 ఓవర్లకు 66/0 స్కోరుతో ఉండగా వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించి బంగ్లా టార్గెట్‌ను 151 పరుగులుగా నిర్దేశించారు. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో చివరికి బంగ్లాదేశ్‌ 145/6 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ విజయంతో భారత్‌ సెమీస్‌ అవకాశాలు మరింత మెరగయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్‌ (6) అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

టాస్‌ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటర్లలో కింగ్ విరాట్‌ కోహ్లీ (64*), కేఎల్‌ రాహుల్‌ (50), సూర్యకుమార్‌ (30) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది భారత్. ఆపై బంగ్లా బ్యాటింగ్‌కు రాగా.. ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ (60) చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని భారత బౌలర్లకు చెమట్లు పట్టించాడు. లిట్టన్‌ దాస్‌ విజృంభణతో ఓ దశలో భారత్‌ ఓడిపోతుందేమోనని ఆందోళన కలిగినప్పటికీ.. ఆపై బౌలర్లు పుంజుకోవడంతో రోహిత్‌ సేన గట్టెక్కింది.

బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 7 ఓవర్లు ముగిశాక వర్షం కురవడంతో ఈ ఇన్నింగ్స్‌ను 16 ఓవర్లకు కుదించారు. హాఫ్ సెంచరీ సాధించి ఊపుమీదున్న దాస్‌ను కేఎల్‌ రాహుల్‌ రనౌట్‌ చేయడంతో మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బౌలర్లు పుంజుకుని వికెట్లు పడగొట్టడంతో టీమిండియా గెలుపొందింది.