T20 World Cup-2022: టీమిండియా ‘సెమీఫైనల్’ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశం

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో మూడు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. టీమిండియా కూడా మూడు మ్యాచులు ఆడి రెండింటిలో విజయం సాధించి, ఒకదాంట్లో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ తో పాటు టీమిండియాకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. రేపటి మ్యాచులో టీమిండియా గెలిస్తే 6 పాయింట్లకు ఎగబాకి సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది.

T20 World Cup-2022: టీమిండియా ‘సెమీఫైనల్’ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశం

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా రేపు బంగ్లాదేశ్ తో టీమిండియా తలపడనుంది. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో మూడు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. టీమిండియా కూడా మూడు మ్యాచులు ఆడి రెండింటిలో విజయం సాధించి, ఒకదాంట్లో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ తో పాటు టీమిండియాకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

రేపటి మ్యాచులో టీమిండియా గెలిస్తే 6 పాయింట్లకు ఎగబాకి సెమీఫైనల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, రేపటి మ్యాచుకు వరుణుడు అడ్డం తగిలే అవకాశం ఉంది. రేపటి మ్యాచ్ అడిలైడ్ ఓవల్ లో జరగాల్సి ఉంది. అయితే, అక్కడ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం పడి రేపటి మ్యాచు టైగా నిలిస్తే బంగ్లాదేశ్-భారత్ జట్ల పాయింట్లు 5-5గా సమంగా ఉంటాయి.

నవంబరు 6న పాక్ తో బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. అదే రోజు టీమిండియా-జింబాబ్వే మ్యాచు ఉంటుంది. గ్రూప్-2లో మొదటి మూడు స్థానాల్లో దక్షిణ ఆఫ్రికా, భారత్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ మూడింట్లో రెండు జట్లు సెమీఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికా ఖాతాలో ఇప్పటివకే 5 పాయింట్లు ఉండడంతో ఆ జట్టు సెమీఫైనల్ కు వెళ్లిందనే చెప్పాలి. రేపటి మ్యాచుకు వరుణుడు అడ్డం తగలకుండా జరిగి, టీమిండియా గెలిస్తే సెమీఫైనల్ కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉంటాయి. రేపు అడిలైడ్ ఓవల్ లో జల్లులు పడే అవకాశం 60 శాతం వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..