T20 World Cup-2022: చాలా బలమైన జట్టును ఎదుర్కొంటున్నాం.. సూర్యను కట్టడి చేస్తాం: బెన్ స్టోక్స్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను తాము కట్టడి చేస్తానని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొడుతున్న షాట్లను అర్థం చేసుకోవడం కష్టతరమవుతున్నప్పటికీ అతడిని కట్టడి చేస్తానని చెప్పాడు. గురువారం జరిగే సెమీఫైనల్స్ లో తమ జట్టు రాణిస్తుందన్న నమ్మకం ఉందని అన్నాడు. విరాట్ కోహ్లీని ఎప్పటికీ తక్కువగా అంచనా వేయలేమని తెలిపాడు. తాము సెమీఫైనల్‌లో చాలా బలమైన జట్టును ఎదుర్కోవాల్సి ఉందని చెప్పాడు.

T20 World Cup-2022: చాలా బలమైన జట్టును ఎదుర్కొంటున్నాం.. సూర్యను కట్టడి చేస్తాం: బెన్ స్టోక్స్

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను తాము కట్టడి చేస్తానని భావిస్తున్నట్లు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కొడుతున్న షాట్లను అర్థం చేసుకోవడం కష్టతరమవుతున్నప్పటికీ అతడిని కట్టడి చేస్తానని చెప్పాడు. గురువారం జరిగే సెమీఫైనల్స్ లో తమ జట్టు రాణిస్తుందన్న నమ్మకం ఉందని అన్నాడు. విరాట్ కోహ్లీని ఎప్పటికీ తక్కువగా అంచనా వేయలేమని తెలిపాడు. తాము సెమీఫైనల్‌లో చాలా బలమైన జట్టును ఎదుర్కోవాల్సి ఉందని చెప్పాడు.

‘‘సూర్యకుమార్ యాదవ్ మంచి ఫాంలో ఉన్నాడు. అయితే, అతడిని కట్టడి చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తాం. క్రీజులో మరోసారి చెలరేగకుండా కట్టడి చేయాలని భావిస్తున్నాం. విరాట్ కోహ్లీతో మాకు ఆరోగ్యకరమైన పోటీతత్వం ఉంది. విరాట్ కోహ్లీ ఫాంలేమితో బాధపడితే వెంటనే దాని నుంచి బయటపడి మళ్ళీ ధాటిగా ఆడగలుగుతాడు. మూడు ఫార్మాట్లలోనూ విరాట్ కోహ్లీ ఆడుతున్న విధంగా మరెవరూ ఆడలేరు’’ అని బెన్ స్టోక్స్ చెప్పాడు.

కాగా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో గ్రూప్-ఏలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-బీలో తొలి స్థానంలో ఉన్న భారత్ ను ఎల్లుండి ఇంగ్లండ్ ఎదుర్కోవాల్సి ఉంది. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ సారి భారత్ కప్ సాధిస్తుందని టీమిండియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..