T20 World Cup 2021: మోకాళ్లపై కూర్చొని నివాళి అర్పించిన టీమిండియా

మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్‌కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది.

T20 World Cup 2021: మోకాళ్లపై కూర్చొని నివాళి అర్పించిన టీమిండియా

Team India (1)

T20 World Cup 2021: మ్యాచ్ ఫలితం అటుంచితే టీమిండియా ఈ గేమ్‌కు ముందు ప్రత్యేకమైన ఫీట్ చేసి మనసులు గెలుచుకుంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో తమ ఆరంభ మ్యాచ్ ను దుబాయ్ వేదికగా ఆడింది. ఆదివారం రాత్రి పాకిస్తాన్ తో జరిగిన గేమ్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీనికి ముందు ఇండియా, పాకిస్తాన్ జట్టు సభ్యులు మోకాళ్లపై నిల్చొని నివాళులర్పించారు.

ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికన్ – అమెరికన్ జార్జ్ ఫ్లైయిడ్ మృతిపై వివక్షాపూరితంగా జరిగిన దారుణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఇండియన్ క్రికెటర్ ఒక్కడే ఐపీఎల్ వేదికగా నిరసన వ్యక్తం చేయగా.. మిగిలిన ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. ఆదివారం మ్యాచ్ కు ముందు టీమిండియా ఇలా చేయడం విశేషం.

ఈ ఉద్యమంపై తొలిసారి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు సైతం మోకాళ్లపై నిలబడి మూడు మ్యాచ్ లకు టెస్టు సిరీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. టాస్ గెలిచిన తర్వాత పదకొండు మందితో మైదానంలోకి వచ్చిన పాక్ టీం కూడా నివాళులు అర్పించింది.

……………………………………………: తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ ఉంటాడా.. కోహ్లీకి సూటి ప్రశ్న

‘వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టి.. ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ సెషన్స్ కూడా బాగా జరిగాయి. మా ప్రిపరేషన్ మీద మాకు నమ్మకముంది. పాకిస్తాన్ బౌలర్లు ఇతర జట్లను ఒత్తిడిలోకి నెడతాయన్నట్లే.. మ్యా బ్యాటింగ్ పై కూడా నమ్మకం ఉంది’ అని మ్యాచ్ కు ముందు చెప్పాడు పాక్ కెప్టెన్.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచిన తర్వాత షహీన్ అఫ్రీది.. 6/2తో జట్టులో పాక్ జట్టులో ఉత్సాహాన్ని పెంచారు. రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం, ఆ తర్వాతే రాహుల్ పెవిలియన్ బాటపట్డం, సూర్యకుమార్ యాదవ్ 6,4 బాది హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో 57పరుగులు చేయడంతో ఇండియా 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసింది. చేధనలో పాక్ ఓపెనర్లు 152పరుగులు లక్ష్యాన్ని అవలీలగా సాధించారు.