T20 World Cup 2021: ఐసీసీ టీమ్‌లో కెప్టెన్‌గా బాబర్ అజామ్.. చోటు దక్కించుకోలేకపోయిన ఇండియన్ ప్లేయర్లు

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది.

T20 World Cup 2021: ఐసీసీ టీమ్‌లో కెప్టెన్‌గా బాబర్ అజామ్.. చోటు దక్కించుకోలేకపోయిన ఇండియన్ ప్లేయర్లు

Icc Team

T20 World Cup 2021: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రకటించింది. రీసెంట్ గా ముగిసిన టీ20 వరల్డ్ కప్ ఆధారంగా ఐసీసీ టీ20 జట్టును అనౌన్స్ చేసింది. ఆశ్చర్యంగా 12మందితో కూడిన ఆ స్క్వాడ్ లో ఒక్క ఇండియన్ ప్లేయర్ కూడా చోటు దక్కించుకోలేకపోగా.. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ను కెప్టెన్ గా తీసుకుంది.

అంతేకాకుండా కామెంటేటర్స్ గా ఐయాన్ బిషప్, నటాలీ జర్మనోస్, షేన్ వాట్సన్, ఇద్దరు జర్నలిస్టులను ఎంపిక చేశారు.

‘టీమ్ సెలక్షన్ కోసం పలు చర్చలు జరిపాం. ప్యానెల్ దానిని గౌరవించింది. ఈ స్ట్రాంగ్ డిబేట్ చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది. బ్యాట్స్ మెన్ చేసిన పరుగులతో పాటు స్ట్రైక్ రేట్ గేమ్ పై ప్రభావం కనబరిచింది. సెలక్ట్ చేసిన ప్లేయర్లు.. మాత్రమే కాకుండా మరికొంత మంది ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలన్నా కుదరలేదు’ అని బిషప్ వెల్లడించారు.

…………………………………………… : ఇంట్లో గణపతి హోమం చేయటం వల్ల సంపద పెరుగుతుందా?..

బాబర్ అజామ్ అధ్యక్షతన ఉండే టీంలో ముగ్గురు ఆస్ట్రేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్.. శ్రీలంకల నుంచి ఇద్దరు చొప్పున, న్యూజిలాండ్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ అందులో స్థానం దక్కించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా డేవిడ్ వార్నర్, మరో ఓపెనర్ గా జోస్ బట్లర్ వాళ్ల తర్వాత బాబర్ అజామ్, శ్రీలంకకు చెందిన అసలంక, దక్షిణాఫ్రికాప్లేయర్ మక్రమ్ ను తీసుకున్నారు.


.
మిగిలిన్ ప్లేయర్లతో కూడిన లిస్ట్ ఇలా ఉంది.
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)
బాబర్ అజామ్ (పాకిస్తాన్)
చరిత్ అసలంక (శ్రీలంక)
ఐడెన్ మక్రమ్ (దక్షిణాఫ్రికా)
మొయిన్ అలీ (ఇంగ్లాండ్)
వనిందు హసరంగ (శ్రీలంక)
ఆడం జంపా (ఆస్ట్రేలియా)
జోష్ హ్యాజిల్ వుడ్ (ఆస్ట్రేలియా)
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
ఆన్రిచ్ నార్ట్జే (దక్షిణాఫ్రికా)
షహీన్ అఫ్రీది (దక్షిణాఫ్రికా)