T20 World Cup 2021: ఆ రోజు క్రికెట్ నుంచే తప్పుకుంటా – విరాట్ కోహ్లీ

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. చివరి టోర్నీ అయిన వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు చేర్చలేకపోయాడు.

T20 World Cup 2021: ఆ రోజు క్రికెట్ నుంచే తప్పుకుంటా – విరాట్ కోహ్లీ

Virat Kohli

T20 World Cup 2021: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. చివరి టోర్నీ అయిన వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ కు చేర్చలేకపోయాడు. చివరిదైన నమీబియాతో మ్యాచ్ లో రోహిత్ శర్మ (56), కేఎల్ రాహుల్ (54) ఇద్దరూ నాటౌట్లుగా భారీ స్కోరు బాదేసి 9వికెట్ల తేడాతో గెలిచేశారు.

‘ముందుగా రిలీఫ్ దొరికింది. చెప్పాలంటే ఇదొక గౌరవం. విషయాలు సరైన దృక్కోణంలో ఉంచాలి’ అని కోహ్లి మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడాడు. ‘నా వర్క్ లోడ్ మేనేజ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఆరేడేళ్ల పాటు క్రికెట్‌ తీవ్రంగా కనిపించింది. జట్టులోని ఆటగాళ్లతో చాలా సరదాగా అనిపించిందని కోహ్లీ చెప్పాడు.

‘మేం నిజంగా ఓ జట్టుగా మంచి ప్రదర్శన చేశాం. ఈ వరల్డ్ కప్‌లో మేం చాలా దూరం వెళ్లలేదని నాకు తెలుసు, కానీ T20లో కొన్ని మంచి ఫలితాలు సాధించాం. కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాం. తొలి 2గేమ్స్ డిఫరెంట్‌గా జరిగాయి. కేవలం అవి టాస్ లు మాకు అనుకూలంగా పడకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పలేను’

…………………………………………..: సామ్‌కు అరుదైన గౌరవం.. తొలి సౌత్ నటిగా గుర్తింపు!

భారత క్రికెట్‌కు అందించిన సేవలకు అవుట్‌గోయింగ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇతర సహాయక సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

‘వారు భారత క్రికెట్‌కు కూడా ఎంతో కృషి చేశారు. వారందరికీ మా అందరి నుంచి కృతజ్ఞతలు’

ఆటగాడిగా కూడా ఇదే జోరు కొనసాగిస్తారా అని అడిగిన ప్రశ్నకు, “అది ఎప్పటికీ మారదు. ఇంతే ఉత్సాహంతో ఆడలేకపోతే ఇక ఆడను. ఇంతకుముందు కెప్టెన్‌గా లేనప్పుడు కూడా ఆట ఎక్కడ జరుగుతుందో చూడాలని ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవాడిని’ అని కోహ్లీ వెల్లడించాడు.

……………………………………..: ఆసుపత్రిలో పిల్లల వార్డులో మంటలు.. ముగ్గురు మృతి