Taapsee Pannu: ఇండియాకు గోల్డ్ తెచ్చిపెట్టినందుకు బాయ్ ఫ్రెండ్‌కు తాప్సీ థ్యాంక్స్

ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఇండియా గెలుపొందడం ఇదే తొలిసారి.

Taapsee Pannu: ఇండియాకు గోల్డ్ తెచ్చిపెట్టినందుకు బాయ్ ఫ్రెండ్‌కు తాప్సీ థ్యాంక్స్

Tapsee Pannu

Taapsee Pannu: ఇండియన్ బ్యాడ్మింటన్ శనివారం చారిత్రక విజయం నమోదుచేసింది. 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఫైనల్స్ లో చిత్తుగా ఓడించి 3-0తేడాతో థామస్ కప్ టైటిల్ గెలుచుకుంది. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ లో ఇండియా గెలుపొందడం ఇదే తొలిసారి.

జట్టు డబుల్స్ కోచ్ మాజీ దానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాట్యాస్ బో. అతను బాలీవుడ్ యాక్టర్ తాప్సీ పన్ను బాయ్ ప్రెండ్ కూడా. శనివారం గేమ్ గెలిచిన అనంతరం.. తాప్సీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. టీంకు కంగ్రాట్స్ తెలియజేయడమే కాకుండా కోచ్ కు స్పెషల్ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.

ఈ టోర్నమెంట్ అంతా ఇండియన్ టీంను ఫాలో అవుతున్న తాప్సీ.. సోషల్ మీడియాలో అప్ డేట్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఇండియా తొలి రెండు మ్యాచ్ లు గెలిచిందని, బెస్ట్ ఫైవ్ లో ఒకటిగా నిలిచిందంటూ కంగ్రాచ్యులేషన్స్ పోస్ట్ చేశారు.

Read Also: ఏంటి నిజమా.. పెళ్లి చేసుకోబోతున్న తాప్సీ?

“మనోళ్లు సాధించారు. ఇండియాకు తొలి థామస్ కప్ తీసుకొచ్చారు” అంటూ టీం మొత్తాన్ని ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. అంతేకాకుండా మిస్టర్ కోచ్ మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారంటూ మట్యాస్ ను ట్యాగ్ చేశారు.