జట్టులో 11మంది కోహ్లీలు ఉండరు

జట్టులో 11మంది కోహ్లీలు ఉండరు

ఏ జట్టులోనూ 11 మంది విరాట్ కోహ్లీలు.. సచిన్ టెండూల్కర్‌లు.. డాన్ బ్రాడ్‌మన్‌లు ఉండరని శ్రీ లంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అంటున్నాడు. టీమిండియా వన్డే సిరీస్‌కు శుభారంభాన్ని నమోదు చేసి 2 వన్డేలను విజయంతో ముగించింది కానీ, ఆ తర్వాత 2 వన్డలలోనూ ఆసీస్‌ను ఓడించలేకపోతుంది. అయితే జట్టులోని ప్లేయర్లు రాణించడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తం అవుతుండటంతో మురళీథరన్ ఇలా స్పందించాడు. 
Read Also :ఫైనల్ ఫైట్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మీడియాతో మాట్లాడిన మురళీ.. ‘విరాట్ కోహ్లీ జట్టులోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ క్రికెటర్. కోహ్లీలాంటి ప్లేయర్లు జట్టు మొత్తం 11మంది ఉండటం సాధ్యం కాదు. ఐసీసీ వరల్డ్ కప్ 2019కు ముందు టీమిండియా డిఫరెంట్ కాంబినేషన్లతో ప్రయోగాలు చేస్తుంది. కొన్ని సార్లు విజయంతో పాటు ఓటమి కూడా ఎదురవుతుంది. దానికి సిద్ధంగా ఉండాలి. సహనంతో ఉండాలే కానీ, ఇలాంటి విమర్శలు చేయకూడదు.

నిజంగా జట్టు విజయమే కోరుకుంటే విమర్శించడం మానేయండి’ ‘ప్రతి జట్టు 11మంది కోహ్లీలు, సచిన్ టెండూల్కర్‌లు, డాన్ బ్రాడ్‌మన్‌లు ఉండవు కదా. అభిమానులు సహనంతో ఉండాలి. భారత ప్లేయర్లు చాలా బాగా ఆడారు. వారిని ఒత్తిడికి గురి చేయడం సబబు కాదు. గేమ్ అంటే గెలుపోటములు సహజం. వారిని ఫ్రీగా వదిలేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొస్తారు’ అని పేర్కొన్నాడు.