ఆస్ట్రేలియాను తీవ్రంగా కట్టడి చేస్తున్న భారత్

ఆస్ట్రేలియాను తీవ్రంగా కట్టడి చేస్తున్న భారత్

దాదాపు నెల రోజుల విరామం తర్వాత వన్డే మ్యాచ్ లు కలిసి ఆడేందుకు పూనుకున్న ఆసీస్-భారత్ ల మధ్యపోరు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ ను టార్గెట్ గా చేసుకుని ఆడుతున్న భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వేగం కనిపించడం లేదు.

కేవలం సింగిల్స్ మీదనే స్కోరు బోర్డు నడుస్తోంది. ఆసీస్ జట్టు మొత్తంలో ఉస్మాన్ ఖవాజా(50) మాత్రమే 76 బంతులాడి అత్యధిక స్కోరు నమోదు చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్(0) డకౌట్ గా వెనుదిరిగాడు. రెండో టీ20లో చెలరేగి ఆడిన గ్లెన్ మ్యాక్స్ వెల్ మీదే ఆసీస్ ఆశలు నిలుపుకుంది.

కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1, కేదర్ జాదవ్ 1 తీయగలిగారు. ప్రస్తుతం 35 ఓవర్లు పూర్తయ్యేసరికి 155 పరుగులు చేయగలిగింది. క్రీజులో టర్నర్(11), మ్యాక్స్ వెల్(34) ఉన్నారు.