Rishabh Pant: వ్యక్తిగత రికార్డులను నేను పట్టించుకోను.. కీలక వ్యాఖ్యలు చేసిన రిషబ్ పంత్

టెస్టుల్లో రిషబ్ పంత్‌కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. బంగ్లాతో రెండో టెస్టు మ్యాచ్‌లో పంత్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. అయితే 93 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ కావటంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. పంత్ 90-99 పరుగుల మధ్యలో అవుట్ కావటంతో ఇది ఆరోసారి. ఈ విషయంపై పంత్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Rishabh Pant: వ్యక్తిగత రికార్డులను నేను పట్టించుకోను.. కీలక వ్యాఖ్యలు చేసిన రిషబ్ పంత్

Rishabh Pant

Rishabh Pant: వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుస వైఫల్యాలతో టీమిండియా బ్యాటర్, కీపర్ రిషబ్ పంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. రిషబ్ ఆటతీరుపట్ల మాజీలతో పాటు క్రికెట్ అభిమానులుసైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టు లో పంత్ రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆచితూచి ఆడుతూ సెంచరీకి చేరువలోకి వచ్చి ఔట్ అయ్యాడు.

Bangladesh vs India: రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకే బంగ్లా ఆలౌట్.. ఆదిలోనే వికెట్ కోల్పోయిన భారత్

టెస్టులో పంత్‌కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. బంగ్లాతో రెండో టెస్టు మ్యాచ్‌లో పంత్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తో కలిసి 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టుకు గౌరవ పదమైన స్కోరును సాధించారు. ఈ క్రమంలో పంత్ వ్యక్తిగత స్కోరు 93 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పంత్ 90-99 మధ్య పరుగుల్లో ఔట్ కావటం ఇది ఆరో సారి. ఇలా పంత్ టెస్టుల్లో ఆరు సార్లు సెంచరీకి దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు.

India vs Bangladesh 3rd ODI: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. ఇంతకుముందు ఎవరెవరు చేశారంటే?

ఈ విషయంపై రిషబ్ పంత్ మాట్లాడుతూ.. నేను వ్యక్తిగత స్కోరును ఏ మాత్రం పట్టించుకోను. అవన్నీ నా దృష్టిలో కేవలం నెంబర్లు మాత్రమే. పరిస్థితికి తగ్గట్లుగా ఆడేందుకు మాత్రమే నేను ప్రయత్నిస్తా. నేను చేసే స్కోరు జట్టు విజయంలో కీలకంగా ఉండాలని భావిస్తా. ఈ క్రమంలో సెంచరీ మిస్సైతే బాధ ఉంటుంది.. కానీ నిరాశ చెందను. బంగ్లాతో రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో శ్రేయాస్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం నాకు సంతోషంగా ఉందని పంత్ అన్నారు.