India vs Australia 3rd Test: ఇండోర్ టెస్ట్ గెలిస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా ..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ కు అర్హత సాధించాలంటే ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే సరిపోతుంది.

India vs Australia 3rd Test: ఇండోర్ టెస్ట్ గెలిస్తే.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు టీమిండియా ..

IND vs AUS Test Match

India vs Australia 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం విధితమే. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు పూర్తికాగా.. రెండింటిల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్టు మ్యాచ్ నేడు ఇండోర్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు మ్యాచ్ ల విజయంతో 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. నేడు ప్రారంభమయ్యే మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఈ టెస్టు మ్యాచ్ విజయం సాధిస్తే టీమిండియా మరో ఘనత కూడా సాధిస్తుంది.

India vs Australia 3rd Test: ఆస్ట్రేలియాకు ఊరట.. మూడో టెస్టుకు ఆల్‌రౌండర్ వచ్చేస్తున్నాడు ..

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ కు అర్హత సాధించాలంటే ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే సరిపోతుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

IND vs AUS 3rd Test Match: అమ్మో.. స్వీప్ షాట్లొద్దు..! మూడో టెస్ట్‌లో రూటు మార్చనున్న ఆసీస్ ఆటగాళ్లు

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10 మ్యాచ్‌లలో విజయం సాధించిన విషయం విధితమే. రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. దీంతో భారత్ 64.06 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు 17 టెస్టు మ్యాచ్‌లు ఆడి 10 మ్యాచ్‌లలో విజయం సాధించి మూడు మ్యాచ్‌లలో ఓడింది. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు 66.67 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. జూన్ 7న లండన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌లోకి వెళ్లే జట్టు టైటిల్ పోరులో ఆసీస్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది.