ఆస్ట్రేలియాకు టీమిండియా.. ప్రత్యేక పీపీఈ కిట్లు, మాస్క్‌లతో ఆటగాళ్లు

  • Published By: vamsi ,Published On : November 12, 2020 / 08:30 AM IST
ఆస్ట్రేలియాకు టీమిండియా.. ప్రత్యేక పీపీఈ కిట్లు, మాస్క్‌లతో ఆటగాళ్లు

నవంబర్‌ 27 నుంచి ప్రారంభంకానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే ఈ టూర్‌కు సంబంధించిన జట్టును సెలెక్ట్ చెయ్యగా.. బీసీసీఐ వీరి కోసం ప్రత్యేకమైన పీపీఈ కిట్‌లు, మాస్క్‌లు తయారుచేయించింది. ఇవాళ(నవంబర్‌ 12) విరాట్‌ కోహ్లీ సారథ్యంలో జట్టు దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఆటగాళ్లు అందరూ సిడ్నీ నగరంలో క్వారంటైన్‌లో ఉండి, తర్వాత అక్కడే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ప్రాక్టీస్ చేస్తారు.


కెప్టెన్‌ విరాట్ కోహ్లీతో పాటు పలువురు భారత క్రికెటర్లు ఇప్పటికే టీమ్‌కు సంబంధించిన బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టారు. ముంబై, ఢిల్లీ ఫైనల్‌ మ్యాచ్‌ చివరి బ్యాచ్‌ ఆటగాళ్లు కూడా జట్టుతో చేరారు. రెండు నెలల సుదీర్ఘ పర్యటన కోసం భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ సంధర్భంగా బీసీసీఐ ప్రత్యేకంగా తయారు చేయించిన మాస్కులు, పీపీఈ కిట్లు ధరించి ఆటగాళ్లు ఫోటోలు దిగారు.





ఆసీస్‌ పర్యటనలో భారత్‌ నవంబర్ 27వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడబోతుంది. కేవలం టెస్ట్‌లకు మాత్రమే ఎంపికైన కారణంగా రోహిత్ శర్మ, ఇశాంత్ శర్మ కొన్ని రోజుల తర్వాత బయల్దేరి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. టెస్ట్ క్రికెట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మాత్రం జట్టుతో బయల్దేరి ఆస్ట్రేలియాకు వెళ్లారు.

MATCHES:

Nov 27, Fri Australia vs India, 1st ODI
Sydney Cricket Ground, Sydney

Nov 29, Sun Australia vs India, 2nd ODI
Sydney Cricket Ground, Sydney

Dec 02, Wed Australia vs India, 3rd ODI
Manuka Oval, Canberra

Dec 04, Fri Australia vs India, 1st T20I
Manuka Oval, Canberra

Dec 06, Sun Australia vs India, 2nd T20I
Sydney Cricket Ground, Sydney

Dec 08, Tue Australia vs India, 3rd T20I
Sydney Cricket Ground, Sydney

Dec 17, Thu – Dec 21, MonAustralia vs India, 1st Test
Adelaide Oval, Adelaide

Dec 26, Sat – Dec 30, Wed, Australia vs India, 2nd Test
Melbourne Cricket Ground, Melbourne

Jan 07, Thu – Jan 11, Mon, Australia vs India, 3rd Test
Sydney Cricket Ground, Sydney

Jan 15, Fri – Jan 19, Tue, Australia vs India, 4th Test
The Gabba, Brisbane